Paramparaa – The Tradition Continues…

నవంబర్‌ 2 నుంచి 11వ తేదీ వరకు తిరుపతి శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఉన్న శ్రీ వేదాంత దేశికులవారి ఆలయంలో నవంబర్‌ 2 నుంచి 11వ తేదీ వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 2వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు ప్రబంధ పారాయణ కార్యక్రమంతో ఉత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. నాలుగువేల దివ్య ప్రబంధాలను ఈ ఉత్సవాల్లో పారాయణం చేయనున్నారు. 11వ తేదీన శాత్తుమొరై కార్యక్రమం జరుగుతుంది. ఆరోజు ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై దేశికులవారి దేవాలయానికి వేంచేస్తారు. […]

నెల్లూరులో ఘనంగా వేదాంత దేశికుల 753వ తిరునక్షత్ర మహోత్సవములు

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఘంటావతార రూపమైన కవితార్కిక సింహ శ్రీ వేదాంతదేశికర్‌ 753వ తిరునక్షత్ర మహోత్సవాలను నెల్లూరులోని రంగనాయకపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికర్‌ దేవస్థానంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ 15 శుక్రవారం ఉదయం శ్రీ వేదాంత దేశికులవారి తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని దేశికులవారిని బంగారు పల్లకీపై ఊరేగించారు. స్వామివారి పల్లకీ సేవను భక్తులంతా తిలకించి పులకరించిపోయారు.

ఆళ్వార్‌ అంటే ఎవరు?

ఆయుమ్‌ అరిందవర్‌ ఆళ్వార్‌ అంటే లోతు తెలిసినవాడని అర్థం. అనగా పరమాత్ముని పట్ల భక్తి ప్రపత్తుల ద్వారా పుణ్యఫలాన్ని పొందినప్పుడు కలిగే పరమానందమనే సాగరపులోతు తెలిసినవాడని అర్థం. ఆళ్వార్ల భక్తి స్వచ్ఛమైనది. తమ దివ్యచరిత్రల ద్వారా, పాశురముల ద్వారా వీరు భక్తి ప్రపత్తుల ద్వారా ఫుణ్యఫలాన్ని పొందినప్పుడు కలిగే పరమానందమనే సాగరపులోతు తెలిసినవాడని అర్థం. ఆళ్వార్ల భక్తి స్వచ్ఛమైనది. తమ దివ్యచరిత్రల ద్వారా పాశురముల ద్వారా వీరు భక్తిభావానికి పునాది వేశారు. ఆళ్వార్ల భక్తిమార్గానికి శ్రీ రామానుజాచార్యులు […]

అశ్వవాహనంపై విహరించిన వేదాంతదేశికులు

నెల్లూరు నగరం రంగనాయక పేట శ్రీ వేదాంత దేశికర్‌ దేవస్థానంలో జరుగుతున్న శ్రీ వేదాంత దేశికుల వారి వార్షిక తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్‌ 14వ తేదీన శ్రీ వేదాంతదేశికులవారిని అశ్వవాహనంపై విహరింపజేశారు. అశ్వవాహనంపై కొలువై ఉన్న శ్రీ వేదాంతదేశికులవారిని భక్తులు తిలకించారు.

గజవాహనంపై కనువిందు చేసిన శ్రీ వేదాంతదేశికులు

నెల్లూరులోని రంగనాయకపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికర్‌ దేవస్థానంలో శ్రీ వేదాంత దేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా శ్రీ వేదాంత దేశికులవారిని గజవాహనంపై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ఆచార్యులవారి ఆశీస్సులను అందుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు విజయసారథి భట్టర్‌, కేసి వరదరాజన్‌, కళ్యాణ్‌ బాలాజీ, రంగరాజన్‌, రాజగోపాల్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రప్రభపై శ్రీ వేదాంత దేశికులు

నెల్లూరు నగరం రంగనాయక పేట శ్రీ వేదాంత దేశికర్‌ దేవస్థానం నందు శ్రీ వేదాంతదేశికులవారి వార్షిక తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం వేదాంత దేశికులవారిని చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు. చంద్రప్రభలో జింకలపై స్వారీ చేస్తూ ఉన్న శ్రీ వేదాంత దేశికులను చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు విజయ సారథి బట్టర్‌, కేసి వరదరాజన్‌, కళ్యాణ్‌ బాలాజీ, రంగరాజన్‌, రాజగోపాల్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆచార్య డే ఉత్సవ వైభవం

అమెరికాలోని అహోబిలమఠం శిష్యులంతా కలిసి ఆచార్యడే ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నారు. హ్యూస్టన్‌లోని శ్రీకృష్ణ వృందావన్‌ దేవాలయంలో ఈ ఉత్సవాలను జరిపారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీకృష్ణుడిని శేషవాహనంపై ఊరేగించారు. వేదుపరి ఉత్సవాన్ని కూడా వైభవంగా నిర్వహించారు ఈ ఉత్సవాలకు సంబంధించిన ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.

దివ్యప్రబంధ సంప్రదాయ పరిరక్షకులు శ్రీమాన్‌ కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌

మన సంప్రదాయం ఎంతో గొప్పదని ఆ సంప్రదాయాన్ని నిలిపేందుకు అహర్నిశలు పాటుపడిన శ్రీమాన్‌ కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ స్వామి భౌతికంగా ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన తయారు చేసిన శిష్యులు మాత్రం ఆయన మార్గాన్ని విడవక తిరుమల, తిరుపతిలో వడగలై సంప్రదాయాన్ని కాపాడుతూ వస్తున్నారు. కంభరాజపురంలో జననం…     తమిళనాడులోని కాంచీపురంకు సమీపంలో కంభరాజపురం అనే ఊరిలో జన్మించిన శ్రీమాన్‌ కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ విద్యాభ్యాసం నిమిత్తం తిరుపతి క్షేత్రానికి వచ్చారు. శ్రీ యామునాచార్యులు నెలకొల్పిన పాఠశాలలో […]