Paramparaa – The Tradition Continues…

అశ్వవాహనంపై విహరించిన వేదాంతదేశికులు

నెల్లూరు నగరం రంగనాయక పేట శ్రీ వేదాంత దేశికర్‌ దేవస్థానంలో జరుగుతున్న శ్రీ వేదాంత దేశికుల వారి వార్షిక తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్‌ 14వ తేదీన శ్రీ వేదాంతదేశికులవారిని అశ్వవాహనంపై విహరింపజేశారు. అశ్వవాహనంపై కొలువై ఉన్న శ్రీ వేదాంతదేశికులవారిని భక్తులు తిలకించారు.

గజవాహనంపై కనువిందు చేసిన శ్రీ వేదాంతదేశికులు

నెల్లూరులోని రంగనాయకపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికర్‌ దేవస్థానంలో శ్రీ వేదాంత దేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా శ్రీ వేదాంత దేశికులవారిని గజవాహనంపై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ఆచార్యులవారి ఆశీస్సులను అందుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు విజయసారథి భట్టర్‌, కేసి వరదరాజన్‌, కళ్యాణ్‌ బాలాజీ, రంగరాజన్‌, రాజగోపాల్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రప్రభపై శ్రీ వేదాంత దేశికులు

నెల్లూరు నగరం రంగనాయక పేట శ్రీ వేదాంత దేశికర్‌ దేవస్థానం నందు శ్రీ వేదాంతదేశికులవారి వార్షిక తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం వేదాంత దేశికులవారిని చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు. చంద్రప్రభలో జింకలపై స్వారీ చేస్తూ ఉన్న శ్రీ వేదాంత దేశికులను చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు విజయ సారథి బట్టర్‌, కేసి వరదరాజన్‌, కళ్యాణ్‌ బాలాజీ, రంగరాజన్‌, రాజగోపాల్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరులో ఘనంగా ఆదివన్‌ శఠగోపస్వామి తిరునక్షత్ర మహోత్సవం

అహోబిల మఠం వ్యవస్థాపకులు, పద కవితా పితామహుడు అన్నమాచార్య గురువుగారు అయిన శ్రీ ఆదివన్‌ శఠగోప స్వామి వారి 642 వ జన్మదిన తిరునక్షత్ర మహోత్సవాలు నెల్లూరు నగరంలోని వేదాంతదేశికర్‌ దేవస్థానంలో వైభవంగా జరిగాయి. తొలుత శ్రీ వేెంకటేశ్వర స్వామి వారికి, వేదాంత దేశికులు వారికి, ఆదివన్‌ శఠగోప స్వామి వారికి సుప్రభాత సేవ తరువాత పల్లకి మహోత్సవం జరిగింది. వేద పండితులచే తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం వెంకటేశ్వర స్వామి వారికి శేష వాహనం శఠగోపస్వామివారికి పల్లకిసేవ, […]

నెల్లూరు ఉత్సవాలు…కనువిందు చేసిన గరుడ సేవ

నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికులు దేవస్థానం ప్రాంగణంలో శ్రీ వేదాంత దేశికర్‌ ఆచార్యులు అహోబిల మఠం వ్యవస్థాపకులు ఆదివన్‌ శఠగోప స్వామి వార్ల ఆచార్య తిరునక్షత్ర ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆదివారం గరుడ వాహన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతానం కిదాంబి నరసింహాచార్యులు అట్టముక్కలతో స్వామివారికి పాదుకలు వేయటం తయారుచేసి స్వామివారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేసీ వరదరాజన్‌, నేలటూరు బాలాజీ, రమేష్‌ […]

రాజయోగాన్నిచ్చే యాళి వాహన దర్శనం…

నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికులవారి ఆలయంలో నిర్వహిస్తున్న వేదాంత దేశికులవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా 8వ తేదీన కవితార్కిక సింహులు శ్రీ వేదాంత దేశికులు యాళివాహనంపై దర్శనమిచ్చారు. తమిళనాడులో కొన్ని ఆలయాల్లో యాళివాహన సేవ జరుగుతుంది. ఆంధ్రరాష్ట్రంలో బహుశా నెల్లూరులోనే ఈ యాళివాహన సేవ జరుగుతుందని అంటారు. ఈ యాళివాహనంపై కొలువై ఉన్న శ్రీ దేశికులవారిని ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని దర్శనం చేసుకున్న వారికి గజకేసరి యోగం పడుతుంది అంటే రాజయోగం లభిస్తుందని మన పెద్దలు […]

సింహవాహనంపై కవితార్కిక సింహులు…

నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికులవారి ఆలయంలో నిర్వహిస్తున్న వేదాంత దేశికులవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా 7వ తేదీన సింహవాహనసేవ జరిగింది. కవితార్కిక సింహులు సింహవాహనంపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.

హంసవాహనంపై కనువిందు చేసిన వేదాంత దేశికులు

నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికులవారి ఆలయంలో నిర్వహిస్తున్న వేదాంత దేశికులవారి జయంతి ఉత్సవాల్లో భాగంగా 6వ తేదీన హంసవాహనసేవ జరిగింది. కన్నులపండువగా జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామివారి హంసవాహన వైభవాన్ని తిలకించారు.

నెల్లూరు శ్రీ వేదాంతదేశికులవారి దేవాలయంలో ఉత్సవాలు

కవితార్కిక సింహులు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఘంటకు ప్రతిరూపంగా కనిపించే  శ్రీ వేదాంతదేశికులవారికి ఆంధ్రదేశంలో వివిధ చోట్ల ఆలయాలు ఉన్నప్పటికీ నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం అందరినీ ఆకట్టుకునేలా కార్యక్రమాలతో, ఉత్సవాలతో వైభవాన్ని చాటుకుంటోంది. ఈ దేశికులవారి ఆలయ చరిత్ర చూస్తే 1887లోనే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. నెల్లూరు పెన్నానది ఒడ్డున వెలసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయానికి ఎదురుగా కేవలం వందగజాల దూరంలో శ్రీ వేదాంతదేశికుల వారి […]