Paramparaa – The Tradition Continues…

నెల్లూరులో శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు 19 నుంచి..

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప యతీర్రద మహాదేశికన్‌ స్వామికి, ఆచార్య సార్వభౌమ తూప్పుల్‌ శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భక్తులంతా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఆలయ మేనెజింగ్‌ ట్రస్టీ శ్రీమాన్‌ కడాంబి వరదరాజన్‌ (జనా), ట్రస్టీలు శ్రీమాన్‌ నేలటూరు బాలాజీ, […]

శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం

                             మునిత్రయ సంప్రదాయం: 1. శ్రీ జయంతి రోజు పూర్తిగా ఉపవాసము చేయవలెను. 2. అట్లు కానియెడల రాత్రి తిరువారాధనం చేయువరకు ఉపవాసముండి, తిరువారాధనము చేసిన తరువాత స్వామికి సమర్పించిన నైవేధ్యం చేసిన వెన్న, పాలు, మొదలగునవి స్వీకరించవచ్చును. 3. అదియు కానిచో  పగటిపూట ఏకాదశివలే పలహార వ్రతం చేయవచ్చును. 4. ఎటు వంటి కారణము చేతను అన్న ప్రసాదము స్వీకరించ కూడదు. మహా పాపము సంభవించును. 5. వ్రతనియమము అన్ని పాటించవలెను.  ( గంధం, తాంబూలం […]

తిరువాడిప్పూరం…తిరుమలనంబి ప్రత్యేకత

తిరువాడిప్పూరం…తిరుమలనంబి ప్రత్యేకత తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి అభిషేకానికి తీర్థకైంకర్యం చేస్తున్న తిరుమలనంబికి, తిరువాడిప్పూరం ఉత్సవానికి ప్రత్యేక సంబంధం ఉంది. తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న పాదాలమంటపం వద్ద తిరుమలనంబి భగవద్రామానుజులవారికి రామాయణ కాలక్షేపం నిర్వహించారని, ఈ రామాయణ కాలక్షేపం వల్ల స్వామివారిని దర్శించుకోవడానికి సమయం లేకపోయిందని తిరుమలనంబి బాధపడుతున్న సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఈ మంటపంలోనే తిరుమలనంబికి సాక్షాత్కరించి ఆయన బాధను పోగొట్టారట.తిరువాడిప్పూరం ఉత్సవసమయంలో ఈ పాదాలమంటపం వద్దకు శ్రీ గోవిందరాజ స్వామిని […]

తల్పగిరిలో ఘనంగా జరిగిన శ్రీరంగనాధుని పుష్పపల్లకీ సేవ

శ్రీ భగవద్రామానుజులవారి తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా మే 2వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాధ స్వామికి, శ్రీ భగవద్రామానుజులవారికి పుష్పపల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. అలాగే శ్రీ భగవద్రామానుజులవారికి విశేష పుష్పాలంకరణలతో, అతి పెద్ద పూలమాలతో అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. ఈ సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

కవితార్కిక సింహుని ఉత్సవాలకు నెల్లూరు ముస్తాబు

నెల్లూరులో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయం ఉత్సవాలకు సిద్ధమవుతోంది. శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ప్రతి నిత్యం వస్తుంటారు. ఆచార్యులవారిని, దేశికులవారిని సేవిస్తూ వారు పాడిన పాశురాలను విని పులకించిపోతుంటారు. శ్రీ వేదాంతదేశికులవారికి ఆంధ్రదేశంలో వివిధ చోట్ల ఆలయాలు ఉన్నప్పటికీ నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం మాత్రం అందరినీ ఆకట్టుకునే కార్యక్రమాలతో, ఉత్సవాలతో వైభవాన్ని చాటుకుంటోంది. నెల్లూరులో ఉన్న శ్రీ వేదాంత దేశికులవారి ఆలయానికి ఘనమైన చరిత్రే ఉంది. 1887లోనే […]

నృసింహస్వామి 32 స్వరూపాలు….

నృసింహస్వామి 32 స్వరూపాలు…. భక్తులకు విశ్వాసాన్నీ … శత్రువులకు భయాన్ని కలిగించడం కోసం శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారం శ్రీనరసింహస్వామి అవతారం. ప్రహ్లాదుడిని హిరణ్య కశిపుడు నుంచి కాపాడిన అవతారం శ్రీ నృసింహావతారం. అలా భూమిపై ఆవిర్భవించిన నరసింహ స్వామి, అనేక స్వరూపాలతో తన భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. లక్ష్మీ నరసింహస్వామి .. యోగానంద నరసింహస్వామి … జ్వాలా నరసింహస్వామి … ప్రహ్లాద సమేత నరసింహస్వామిగా ఆయన వివిధ క్షేత్రాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి నరసింహస్వామి 32 స్వరూపాలని […]

కమనీయం సీతారాముల కళ్యాణం…

శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం! సీతాపతిం రఘుకులాన్వయ రత్నద్వీపం ఆజానుబాహు అరవింద దళాయతాక్షం! రామం నిశాచర వినాశకరం నమామి!! అంటూ దివ్యపురుషుణ్ణి భక్తి మనస్సుతో ఆరాధించుకునే పుణ్యప్రదమైన రోజు శ్రీరామనవమి. ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నది. చైత్ర శుద్ధ నవమి. పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు పుట్టాడు. చిత్రమేమిటంటే ఆ పుట్టినరోజే అంటే ఆయా తిథి వార నక్షత్రాల్లోనే ఆయనకు వివాహం జరిగింది. పట్టాభిషేకం జరిగిన శుభసమయం కూడా ఇదే కావడం విశేషం. దీంతోపాటు జగదేకమాత సీతాదేవి తన కళ్యాణప్రదమైన […]