శ్రీనివాస మంగాపురం – అలమేలు మంగాపురం
మనలో చాలా మందికి శ్రీనివాస మంగాపురం అన్నా అలమేలు మంగాపురం అన్నా ఒకటే అని తెలీదు…ఇంకా కొందరు భక్తులు అయితే తిరుచానూరుని అలమేలు మంగాపురం అని కూడా పిలుస్తారు.అసలు విషయం ఏమిటంటే ఇప్పటి శ్రీనివాస మంగాపురం లో ఒకప్పుడు ఎన్నో దేవతల ఆలయాలు ఉండేవి.వాటిలో అలమేలు మంగమ్మ ఆలయం కూడా ఒకటి.అయితే ముష్కరుల దాడిలో ఈ శ్రీనివాస మంగాపురం ఎంతో ధ్వంసమయింది…అలమేలు మంగమ్మ ఆలయం లోని విగ్రహాన్ని , నగలను దుండగులు ఎత్తుకు పోయారు.అయితే శ్రీనివాసుని విగ్రహం […]
న్యూయార్క్‌లో మోహినీ అలంకారంలో దర్శనమిచ్చిన గోదాదేవి
న్యూయార్క్‌లోని పొమనాలో ఉన్న శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో ఘనంగా ధనుర్మాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోదాదేవిని, శ్రీరంగనాధస్వామిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు కనువిందు చేస్తున్నారు. వైకుంఠఏకాదశి ముందురోజున బుధవారంనాడు జనవరి 12వ తేదీన మోహినీ అలంకారములో గోదాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రంగనాథస్వామి ముత్తాంగిగా కనువిందు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో శ్రీకృష్ణ దేశిక జీయర్ స్వామి ఆధ్వర్యంలో తిరుప్పావై పారాయణం జరిగింది. ఎంతోమంది భక్తులు ఈ ఉత్సవ వేడుకల్లో పాల్గొని తరించారు.
గురువాయూరప్పన్ దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు
నెల్లూరు నగరంలోని శ్రీ గురువాయురప్పన్ దేవస్థానంలో ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి మంగళవారం గోదాదేవి శ్రీ రంగనాథ స్వామివారికి సమర్పించిన కూడారై వెళ్లి విశేష పాశురాన్ని పురస్కరించుకుని ఆండాళ్ అమ్మవారికి క్షీరాన్నంను 108 గిన్నెలలో సమర్పించారు. ఏలూరు గంగా లాల పాయసాన్ని నివేదన చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు అద్దంకి నరసింహాచార్యులు స్వామివారి వైభవాన్ని గోదా దేవి భక్తి పారవశ్యాన్ని భక్తులకు వివరించారు. ఆలయ కార్యదర్శి కత్తుల వెంకట రత్నం కోశాధికారి గడ్డం రత్నయ్య కత్తి […]
నెల్లూరులో ఘనంగా ధనుర్మాస, అధ్యయనోత్సవాలు
నెల్లూరు నగరంలో శ్రీ రంగనాథస్వామి దేవస్థానం, వేణుగోపాల స్వామి దేవస్థానం, గురువాయురప్ప దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఉడయవర్ల దేవస్థానం, శ్రీ వేదాంత దేశికుల దేవస్థానం నందు ధనుర్మాస ఉత్సవాలను నిర్వహిస్తూ, శ్రీ ఆండాల్ తిరుప్పావై పాశురాలను ఘనంగా పారాయణ చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పగల్పత్తు ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు శ్రీ వైష్ణవ అధ్యాపకులు అధ్యయనోత్సవాలను తిరుప్పావై పాశురాలను పారాయణ చేస్తూ, భగవద్ శ్రీ రామానుజుల వేదాంత […]
న్యూయార్క్ రంగనాధ స్వామి దేవాలయంలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు
న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో ఘనంగా ధనుర్మాస పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోదాదేవిని, శ్రీ రంగనాధ స్వామిని అందంగా అలంకరించి తిరుప్పావై పాశురాలను సేవిస్తున్నారు. పలువురు భక్తులు ధనుర్మాసవేళలో గోదాదేవి అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్) మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసంగా పిలుస్తారు. సాక్షాత్ భూదేవి, అవతార […]
తిరుక్కురుంగుడిలో కైశిక ఏకాదశి ప్రాముఖ్యత
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో తిరుక్కురుంగుడి ఉంది. కన్యాకుమారికి ఉత్తరాన 40 కి.మీ .దూరంలో, తిరువనంతపురంకు 120 కి.మీ దూరంలో ఈ ప్రాంతం ఉంది. ఇక్కడ ఉన్న నంబిరాయర్ దేవాలయానికి 1300 ఏళ్ళ చరిత్ర ఉంది. వరాహపురాణం, బ్రహ్మాండ పురాణంలో ఈ దేవాలయం ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఆలయం చుట్టూ పెద్ద పెద్ద వీధులు కనిపిస్తాయి. చుట్టూ వీధులు, మధ్యలో కోటలాంటి ప్రాంతంలో ఈ దేవాలయాన్ని క్రమబద్ధంగా నిర్మించిన తీరు మనలను ఆకర్షిస్తుంది. ఇక్కడ కొలువైన స్వామి వారిని తిరుమళిశైపిరాన్, […]