శ్రావణమాసం…వరలక్ష్మీ వ్రతం

శ్రావణమాసం పవిత్రమైన మాసంగా చెబుతారు. ఈ మాసంలో మంగళగౌరి, వరలక్ష్మీ వ్రతాలు శ్రావణ పూర్ణిమ తదితర పండుగలు వస్తాయి. ఈ మాసంలో వచ్చే మంగళవారాల్లో గౌరీదేవిని ‘మంగళగౌరీ’గా కొలుస్తూ చేసే మంగళగౌరీ నోముతోపాటు, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మహాలక్ష్మిని ‘వరలక్ష్మీ’ పేరుతో అర్చిస్తూ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. ‘పవనం సంపూజ్య కల్యాణం వరలక్ష్మీ స్వశక్తి దాతవ్యం అన్నట్లు వరాలనిచ్చే లక్ష్మీ వరలక్ష్మీయని శుక్రవారం వ్రత నియమాలను పాటిస్తూ పూజిస్తే కోరిన వరాలను అనుగ్రహిస్తుందంటారు. సంవత్సరంలోని పన్నెండు […]
పుణ్యమార్గం చూపించే ధనుర్మాసం

మార్గశిరం మాసం వచ్చింది…ఈనెలనే ధనుర్మాసం అని కూడా అంటారు. భగవంతునికి ఈనెల ఎంతో ఇష్టమైంది. స్వయంగా శ్రీ కృష్ణపరమాత్ముడే భగవద్గీతలో ఈ విషయాన్ని మాసానాం మార్గశీర్షోహం అంటూ సెలవిచ్చారు. ఆధ్యాత్మిక చింతన, మధురభక్తికి ప్రతీకగా ధనుర్మాసం నిలుస్తుంది. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన నాటి నుంచి మకరరాశిలో ప్రవేశించేవరకు ఉన్న నెలరోజుల కాలమే ధనుర్మాసం. ఈనెలలో విష్ణుమూర్తికోసం చేసే చిన్న పూజ అయినా పెద్దఫలాన్నే ఇస్తుందని చెబుతారు. ఈ మాసానికి అంత ప్రభావం ఉంది. ధనుర్మాసంలో ‘తిరుప్పావై’ వ్రతం […]