సేవల్లో మిన్న… విమలా రంగాచారి
చిన్నప్పుడు దేశభక్తితో అందరినీ మెప్పించి, వివాహం తరువాత కుటుంబ బాధ్యతలతోపాటు భర్తకు తోడునీడుగా ఉంటూ, మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొని మంచి పేరు తెచ్చుకున్న శ్రీమతి విమలా రంగాచారిగారు అందరి శ్రేయోభిలాషిగా ఉంటున్నారు. మాతరంలో ఉన్న స్ఫూర్తి నేటితరంలో కనిపించడం లేదని దానిని పెంపొందించేలా చేయాలన్నదే తన ఆశయమని ఆమె చెబుతున్నారు. చిన్ననాటి సంగతులు… నేను పుట్టింది కలకత్తా అయినా నా బాల్యం మాత్రం నెల్లూరు జిల్లాలో సాగింది. మా అమ్మ పేరు […]