మహాభక్తుడు పోతన

పదునైదవ శతాబ్ధమున తెలుగు సాహిత్యాకాశమున దేదీప్యమానముగా సూర్యునివలె వెలిగినవాడు శ్రీనాథ మహాకవి. ఉత్తరార్థమున చల్లని వెన్నెలలు విరియించిన చంద్రునివంటి వాడు పోతన. పోతన మహాభక్తుడు. కవిత్వ పాండిత్యము ఆయనను సహజముగా వరించినవి. రాజాశ్రయమునకు దూరంగా ఉండి సాధారణ కర్షక జీవితము అవలంబించి తెలుగునాట భాగవత కల్పతరువును నాటిన మహాకవి పోతన. తెలుగుజాతికి తెలుగు కవిత్వమునకు సుకృతము పంటలాగా పోతన కవిత్వాలు నిలిచాయి. ప్రాచీన సాహిత్యమంతటిలో రెండే రెండు కృతులు పేర్కొనవలసి వచ్చినచో ఒకటి కవిత్రయము వారి భారతము, […]