Paramparaa – The Tradition Continues…

Dayasatakam by U.Ve. Chakravarthy Ranganathan

దయాశతకం….

వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత విశిష్టమైన మరియు భక్తిభావంతో కూడిన గొప్ప స్తోత్రం దయా శతకం. కవితార్కిక సింహం, సర్వతంత్ర స్వతంత్రులు శ్రీమద్ వేదాంతదేశికులు రచించిన అద్భుతమైన స్తోత్రం ఇది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుని అనంతమైన “దయా గుణం” (కరుణ) ను ఒక చేతన దివ్య శక్తిగా (దేవతగా) భావించి, ఆ దయాదేవిని స్తుతిస్తూ చేసిన రచన ఇది. 108 శ్లోకాలు ఉన్న ఈ దయాశతకం ప్రపత్తిని నిరూపించుటకే యవతరించినదని పెద్దలు చెబుతారు. స్తోత్రారంభములో నుండు “ప్రపద్యే” అను ప్రథమ పదమే దీనికి నిదర్శనం. మోక్షార్ధమైన ప్రపత్తి యనగా.. భగవంతునియొద్ద “కర్మ-జ్ఞాన-భక్తి యోగాదుల ననుష్ఠించుటకు నాకు శక్తి సామర్ధ్యాదులును, క్షమయు లేదు. నీవు తప్ప నాకు వేరుగతిలేదు. ఇక నీకు అనుకూలుడుగా నుండెదను అని పేర్కొంటున్నారు. భగవంతునికి జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం, శక్తి, తేజస్సు అనే అనేక గుణాలు ఉన్నప్పటికీ, ఆయనలో ఉన్న “దయా గుణం” లేకపోతే ఆ గుణాలన్నీ వ్యర్థమేనని వేదాంత దేశికులు వర్ణిస్తారు. జీవులకు మోక్షాన్ని ప్రదానం చేసేది భగవంతుని దయ మాత్రమే అని దానిని దృష్టిలో పెట్టుకునే శ్రీ వేదాంతదేశికులవారు ఈ స్తోత్రాన్ని మనకు అందించినట్లు అవగతమవుతున్నది. ఈ 108 శ్లోకాలను 10 పద్ధతులుగా/దశకాలుగా విభజించారు. ప్రతి దశకంలో దయాదేవి యొక్క విభిన్న రూపాలను, మహిమలను, అవతార విలాసాలను మనోహరంగా వర్ణించారు. ఈ స్తోత్రాల కావ్యరచన అద్భుతంగా కనిపిస్తుంది. తిరుమల కొండను శ్రీనివాసుని దయ గడ్డగా మారి ఏర్పడిన చక్కెర కొండగాను, స్వామి దయను ప్రవహించే దివ్య ప్రవాహంగాను రూపకాలతో అద్భుతంగా వర్ణించారు. మొదటి శ్లోకంలోనే ఇది మనకు కనిపిస్తుంది.
అద్భుతమైన ఈ స్తోత్రాన్ని తిరుపతిలోని ప్రముఖ పండితులు ఉ.వే. చక్రవర్తి రంగనాధన్ గారు మనకు పరంపర వెబ్ సైట్ ద్వారా తెలియజేశారు. అందరూ ఈ స్తోత్రాన్ని వినితరించాల్సిందిగా కోరుతున్నాము.

Learn Stotras, Divya Prabandham, Sanskrit and Nithya Karma

EVENTS

Local   Temple   NRI   Pontiffs’ Tour