కమనీయం సీతారాముల కళ్యాణం…
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం! సీతాపతిం రఘుకులాన్వయ రత్నద్వీపం ఆజానుబాహు అరవింద దళాయతాక్షం! రామం నిశాచర వినాశకరం నమామి!! అంటూ దివ్యపురుషుణ్ణి భక్తి మనస్సుతో ఆరాధించుకునే పుణ్యప్రదమైన రోజు శ్రీరామనవమి. ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నది. చైత్ర శుద్ధ నవమి. పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు పుట్టాడు. చిత్రమేమిటంటే ఆ పుట్టినరోజే అంటే ఆయా తిథి వార నక్షత్రాల్లోనే ఆయనకు వివాహం జరిగింది. పట్టాభిషేకం జరిగిన శుభసమయం కూడా ఇదే కావడం విశేషం. దీంతోపాటు జగదేకమాత సీతాదేవి తన కళ్యాణప్రదమైన […]