దేశిక విజయం

శ్రీ వేదాంత దేశికులు అన్నీరంగాల్లో ప్రావీణ్యం సంపాదించడమే కాకుండా, వైష్ణవ సిద్ధాంతాన్ని అన్నింటా అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేశారు. మానవులను సన్మార్గంలో పయనింపజేయడానికి అనేక శాస్త్రాలను, గ్రంథాలను, స్తోత్రాలను రాయడమే కాకుండా, వితండవాడంతో, అహంకారంతో అసూయాద్వేషాలతో విర్రవీగే పండితులను తన వాదపటిమతో ఓడిరచారు. భగవద్ రామానుజులు బోధించిన విశిష్టాద్వైతాన్ని మరింతగా విస్తరించేందుకు దేశికులవారు కృషి చేశారు. అధ్యయనోత్సవం వివాదంశ్రీరంగంలో సంప్రదాయం ప్రకారం నిర్వహించే అధ్యయనోత్సవాన్ని అద్వైత పండితులు అడ్డుకున్నారు. అక్కడ పండితులు వృద్ధులైనందువల్ల వారితో వాదోపవాదనకు దిగలేకపోయారు. […]