Paramparaa – The Tradition Continues…

న్యూయార్క్‌ రంగనాధ స్వామి దేవాలయంలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు

న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీ రంగనాధ స్వామి దేవాలయంలో ఘనంగా ధనుర్మాస పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గోదాదేవిని, శ్రీ రంగనాధ స్వామిని అందంగా అలంకరించి తిరుప్పావై పాశురాలను సేవిస్తున్నారు. పలువురు భక్తులు ధనుర్మాసవేళలో గోదాదేవి అమ్మవారిని దర్శించి తరిస్తున్నారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్‌) మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసంగా పిలుస్తారు. సాక్షాత్‌ భూదేవి, అవతార […]