శ్రీ మహాలక్ష్మి మహా వైభవ ఆవిర్భావం
ఈశానాం జగతోస్య వేంకటపతే ర్విష్టోః పరాం ప్రేయసీం తద్వక్షః స్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీమ్ పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుని హృదయంలో నివసిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రియురాలై అలరారుతూ, పద్మాసనంలో వేంచేసి సుకుమారమైన చేతులలో పద్మాలను అలంకారంగా ధరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తున్న శ్రీ మహాలక్ష్మికి ఇవే మన నమస్కారములు. సంపూర్ణ విశ్వంలో సకల శుభాలను అనుగ్రహించేది, సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది, […]