తల్పగిరిలో ఘనంగా జరిగిన శ్రీరంగనాధుని పుష్పపల్లకీ సేవ

శ్రీ భగవద్రామానుజులవారి తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా మే 2వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాధ స్వామికి, శ్రీ భగవద్రామానుజులవారికి పుష్పపల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. అలాగే శ్రీ భగవద్రామానుజులవారికి విశేష పుష్పాలంకరణలతో, అతి పెద్ద పూలమాలతో అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. ఈ సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.