గురువాయూరప్పన్ టెంపుల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు
న్యూజెర్సిలోని శ్రీ గురువాయూరప్పన్ టెంపుల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా వాహన సేవతోపాటు ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని పిల్లలు శ్రీకృష్ణుని వేషధారణలో కనిపించి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రముఖులతోపాటు, పండితులు, భక్తులు పాల్గొన్నారని పవన్ రాళ్ళపల్లి తెలియజేశారు.