హయగ్రీవస్వామివారి డోలోత్సవం 11-08-2022
శ్రావణ పూర్ణిమ మరియు శ్రీహయగ్రీవ జయంతి సందర్భంగా 11 -08 -2022 తేదీన, శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధి వీధిలోని శ్రీ పరకాల మఠంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారికి క్రొత్తగా బహూకరించిన డోలై (ఉయ్యాల)లో శ్రీ లక్షీహయగ్రీవ స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రము 4.00 గంటలకు జరిగే ఈ డోలోత్సవంలో భక్తులంతా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని కోరుతున్నాము.