Paramparaa – The Tradition Continues…

చక్రవర్తి రంగనాధన్‌ గారికి ‘ప్రవచన చక్రవర్తి’ బిరుదు

అఖిలభారతీయ బ్రాహ్మణ సంఘం వారు గురు పురస్కారం పేరుతో నిర్వహించిన వేడుకల్లో శ్రీ ఉ.వే. చక్రవర్తి రంగనాధాచార్య స్వామివారిని ప్రవచన చక్రవర్తి బిరుదుతో ఘనంగా సత్కరించారు. కడప జిల్లాలోని గండి క్షేత్రంలో ఈ వేడుక జరిగినది.

జూలై 1 నుంచి న్యూయార్క్‌లో శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో జూలై 1 నుంచి 10 రోజులపాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.జూలై 1వ తేదీన ఉదయం 10 గంటలకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, సాయంత్రం 5 గంటలకు విష్వక్సేన ఆరాధనం, మృత్‌సంగ్రహణ రక్షా బంధన, అంకురార్పణ, శ్రీ గరుడ ఆధీవాసం, హోమం, వేదం, నాలాయిర దివ్యప్రబంధ పారాయణ తొడక్కం జరుగుతాయి.జూలై 2వ తేదీన ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, గరుడ ప్రసాద వితరణ, 11 గంటలకు శేషవాహన సేవ, మహా […]