కంభరాజపురం మురళీ అయ్యంగార్, టి.కె ముకుందన్‌కు అవార్డుల ప్రదానం
శ్రీరంగంలోని దేశికర్ సన్నిధిలో జరిగిన శ్రీ నాథమునుల 1200వ తిరునక్షత్ర మహోత్సవంలో శ్రీ పౌండరీకపురం ఆండవన్ స్వామివారు పండితులను ఘనంగా సన్మానించారు. తిరుపతికి చెందిన కంభరాజపురం మురళీ అయ్యంగార్‌ను అధ్యాపకరత్న చూడామణి అవార్డుతో, తిరుమలనంబి వంశీయులైన టి.కె. ముకుందన్‌ను ఆచార్య కైంకర్యరత్నచూడామణి అవార్డుతోనూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దివ్య ప్రబంధ పారాయణం, వివిధ కార్యక్రమాలను వైభవంగా జరిపారు. ఈ వేడుకల్లో ఆండవన్ స్వామి మాట్లాడుతూ, నాధమునులు పెరుమాళ్ళకు చేసిన కైంకర్యం, వైష్ణవలోకానికి చేసిన సేవలను తెలియజేశారు.తిరుపతిలోని […]