రంగనాధన్ స్వామికి ద్రావిడామ్నాయ పరిచర్యా నిరతః అవార్డు
తిరుమల తిరుపతిలో దివ్య ప్రబంధ కైంకర్యం చేస్తూ, వివిధ చోట్ల జరిగే గోష్టులకు హాజరవుతూ, మరోవైపు ప్రవచనాలు చేస్తూ, పరంపరా.ఇన్ (paramparaa.in) వెబ్ సైట్ ద్వారా ఎంతోమందికి దివ్య ప్రబంధాలను నేర్పిస్తున్న డా. చక్రవర్తి రంగనాధన్ స్వామికి చెన్నైలో జరిగిన ఏకదిన ప్రబంధ గోష్టిలో సన్మానం చేయడంతోపాటు ద్రావిడామ్నాయ పరిచర్యా నిరతః అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతిలో శ్రీ రంగనాధన్ స్వామి చేస్తున్న కైంకర్యాన్ని అందరూ ప్రశంసించారు.