Paramparaa – The Tradition Continues…

కవితార్కిక సింహుని ఉత్సవాలకు నెల్లూరు ముస్తాబు

నెల్లూరులో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయం ఉత్సవాలకు సిద్ధమవుతోంది. శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ప్రతి నిత్యం వస్తుంటారు. ఆచార్యులవారిని, దేశికులవారిని సేవిస్తూ వారు పాడిన పాశురాలను విని పులకించిపోతుంటారు. శ్రీ వేదాంతదేశికులవారికి ఆంధ్రదేశంలో వివిధ చోట్ల ఆలయాలు ఉన్నప్పటికీ నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం మాత్రం అందరినీ ఆకట్టుకునే కార్యక్రమాలతో, ఉత్సవాలతో వైభవాన్ని చాటుకుంటోంది. నెల్లూరులో ఉన్న శ్రీ వేదాంత దేశికులవారి ఆలయానికి ఘనమైన చరిత్రే ఉంది. 1887లోనే […]

దేశికుల వారి సన్నిధికి వేంచేసిన గోవిందరాజస్వామి

తిరుపతిలోని శ్రీ వేదాంత దేశికులవారి సన్నిధిలో జరుగుతున్న 755వ తిరునక్షత్రం వేడుకల్లో భాగంగా చివరిరోజున శ్రీ దేశికులవారి సన్నిధికి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ గోవిందరాజస్వామి వేంచేశారు. ఈ సందర్భంగా గోవిందరాజస్వామివారి మాలలను దేశికులవారికి అలంకరించిన తరువాత హారతి గోష్టి జరిగింది. ఈ సందర్భంగా శ్రీమాన్‌ కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ స్వామి శిష్యులు దివ్య ప్రబంధ సేవాకాలం, వేద శాత్తుమొరై జరిపారు. ఈ కార్యక్రమంలో టీటిడి అధికారులతోపాటు భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా ముగిసిన ఆదివణ్‌ శఠగోప ఉత్సవాలు

తిరుపతిలోని శ్రీ అహోబిలమఠంలో మూడురోజులపాటు అక్టోబర్‌ 17 నుంచి 19వ తేదీవరకు జరిగిన శ్రీ ఆదివణ్‌ శఠగోప యతీంద్ర మహాదేశికుల వారి వార్షిక కేట్టై తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. చివరిరోజున తిరువళ్ళూరు, తిరుపతి గోవిందరాజ స్వామి సన్నిధి, తిరుచానూరు పద్మావతి దేవాలయం నుంచి వచ్చిన మాలలను దివ్య ప్రబంధ, వేద పారాయణాల నడుమ శ్రీమత్‌ ఆదివణ్‌ శఠగోప యతీంద్రులవారికి సమర్పించారు. కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు దివ్య ప్రబంధ పారాయణ సేవలో పాల్గొన్నారు. వీరితోపాటు మఠం […]

తిరుపతి శ్రీ దేశికులవారి ఉత్సవాలు 14 నుంచి ప్రారంభం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి గుడి వద్ద ఉన్న శ్రీ వేదాంత దేశికులవారి ఉత్సవాలు అక్టోబర్‌ 14 నుంచి ప్రారంభమవుతున్నాయి. 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. విశేషంగా జరిగే ఈ ఉత్సవాలను ఈసారి కూడా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దివ్య ప్రబంధ పారాయణం, వేద పారాయణం, స్తోత్రపఠనం వంటివి జరగనున్నాయి. కంభరాజపురం శ్రీ శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు ప్రతి సంవత్సరం ఈ దేశికులవారి ఉత్సవాల్లో ప్రబంధ పారాయణం చేస్తున్న సంగతి తెలిసిందే. […]

వైభవంగా జరిగిన ఆదివణ్‌ శఠగోపస్వామి తిరునక్షత్ర మహోత్సవం

నెల్లూరు నగరం రంగనాయక పేటలో వేంచేసియున్న శ్రీ వేదాంత దేశికర్‌ దేవస్థానం నందు అన్నమాచార్యుల గురువులు అహోబిల మఠం వ్యవస్థాపకులు ఆదివణ్‌ శఠగోప స్వామివారి స్వామి 654 వర్ష తిరునక్షత్ర మహోత్సవములు శనివారం ఘనంగా జరిగాయి. ఉదయం ఆదివన్‌ శఠగోప స్వామివారికి పల్లకి గొడుగులు ఉత్సవం, శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్లకు శ్రీ ఆదివన్‌ శఠగోప స్వామి, వేదాంత దేశిక స్వామివార్లకు స్నపన తిరుమంజనం సాయంత్రం శేష వాహనంపై పేట ఉత్సవం […]

నెల్లూరు దేశికుల ఉత్సవాలు: వైభవంగా నాచ్చియార్‌ తిరుక్కోలం ఉత్సవం

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 29వ తేదీ గురువారంనాడు ఉదయం 8 గంటలకు నాచ్చియార్‌ తిరుక్కోలం ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ ఉ.వే. వి.ఎస్‌. రాఘవన్‌ స్వామి స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు, శ్రీమాన్‌ వెంకట రాఘవన్‌ (హైదరాబాద్‌), శ్రీమాన్‌ కోదండ రామన్‌ (ఖతార్‌) వ్యవహరించారు. సాయంత్రం శ్రీ వేదాంతదేశికులవారికి, శ్రీ ఆదివణ్‌ శఠగోప యతీంద్ర మహాదేశికన్‌ స్వామికి ఊంజలసేవ […]