Paramparaa – The Tradition Continues…

శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలకు ముస్తాబవుతున్న నెల్లూరు

నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం ఉత్సవాలకు సిద్ధమవుతోంది. కవితార్కిక సింహులు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఘంటకు ప్రతిరూపంగా కనిపించే  శ్రీ వేదాంతదేశికులవారికి ఆంధ్రదేశంలో వివిధ చోట్ల ఆలయాలు ఉన్నప్పటికీ నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల ఆలయం మాత్రం అందరినీ ఆకట్టుకునే కార్యక్రమాలతో, ఉత్సవాలతో వైభవాన్ని చాటుకుంటోంది.నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న ఈ ఆలయానికి భక్తులు ప్రతి నిత్యం వస్తుంటారు. ఆచార్యులవారిని, దేశికులవారిని సేవిస్తూ వారు పాడిన పాశురాలను విని పులకించిపోతుంటారు.నెల్లూరులో […]

ఘనంగా శ్రీకృష్ణదేవాలయం ప్రతిష్ఠా మహోత్సవం

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని పెద్దిరెడ్డిపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మీ ఆండాళ్‌ సహిత శ్రీ కృష్ణదేవాలయం. ఆశ్రమం, వేదపాఠశాల ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంటున్న శ్రీ కృష్ణ దేశిక జీయర్‌ స్వామి వారి పర్యవేక్షణలో ఈ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ మహోత్సవం సందర్భంగా 17వ తేదీన విష్వక్సేన ఆరాధన, పుణ్యావాచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ హోమం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. 18వ తేదీన ద్వారతోరణ, ధ్వజకుంభ ఆవాహన ఆరాధనలు […]

న్యూయార్క్‌లో ఘనంగా శ్రీనృసింహజయంతి

న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీరంగనాధ స్వామి దేవాలయంలో శ్రీ నృసింహ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి విశేష కార్యక్రమాలను నిర్వహించారు. నూతన స్వర్ణకిరీటాన్ని ఈ సందర్భంగా ధరింపజేశారు. నృసింహ అవతార ఆవిర్భావ విశేషములను ఈ సందర్భంగా శ్రీ కృష్ణదేశిక జీయర్‌ స్వామి భక్తులకు వివరించారు.

నెల్లూరులో ఘనంగా రామానుజ జయంతి

నెల్లూరులో ఆదిశేషుని అవతారమైన శ్రీ రామానుజులవారి జయంతిని అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రామానుజులవారిని ఊరేగించారు. నెల్లూరులోని శ్రీ వేదాంత దేశికుల వారి దేవాలయం ముందు, ఆండవన్ ఆశ్రమం ముందు నిర్వహించిన హారతి కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

హ్యూస్టన్‌లో హయగ్రీవస్వామి డోలోత్సవం

పరకాలమఠం యుఎస్‌ఎ ఆధ్వర్యంలో శ్రీ హయగ్రీవస్వామి డోలోత్సవ సేవను హ్యూస్టన్‌లో ఘనంగా నిర్వహించారు. హ్యూస్టన్‌లో ఉంటున్న స్వామి శ్రీధర్‌ సంపత్‌ గృహంలో జరిగిన డోలోత్సవ సేవలో ఎంతోమంది భక్తులు, పారాయణదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష కార్యక్రమాలను దివ్య ప్రబంధ పారాయణం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

శ్రీ కృష్ణదేశిక జీయర్‌స్వామివారి శ్రీమద్రామాయణ ఉపన్యాసం

న్యూయార్క్‌లోని పొమనాలో ఉన్న శ్రీ కృష్ణ దేశిక జీయర్‌ స్వామివారిచే శ్రీమద్రామాయణ ఉపన్యాస కార్యక్రమాలను ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహిస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 10.30 (ఇఎస్‌టి), భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు ఈ ప్రవచనాలను వినవచ్చు. శ్రీకృష్ణ ఆశ్రమం వారు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగవతులంతా పాల్గొని జీయర్‌స్వామివారు చెప్పే శ్రీరాముని దివ్యచరితమును వినవల్సిందిగా కోరుతున్నారు. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ, ఉత్తరకాండములను […]

5000 మంది రుత్వికులు…వేదమంత్రోచ్ఛారణలతో పులకరించిన ముచ్చింతల్‌

హైదరాబాద్‌ శంషాబాద్‌లోని ముచ్చింతల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్యుల వెయ్యేళ్ల జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదువేల మంది రుత్వికులు.. ఒకే సమయంలో వేద మంత్రోచ్ఛారణలతో ఆ ప్రాంతం పులకరించిపోయింది. జై శ్రీమన్నారాయణ.. జైజై శ్రీమన్నారాయణ నామ స్మరణలతో ఆ ప్రాంతం మారుమోగింది. సమతామూర్తి వేడుకల ప్రాంగణం భక్తులు, కళాకారులతో ప్రాంగణమంతా అత్యంత శోభాయమానంగా మారింది. అంకురార్పణ కార్యక్రమం పుట్టమన్ను సేకరణతో ప్రారంభమైంది. దివ్య సాకేతాలయం సమీపంలో పుట్ట నుంచి రుత్వికులు మట్టిని […]

నెల్లూరు నగరంలో పగల్పత్తు రాపత్తు ఉత్సవాలు

నెల్లూరు నగరం రంగనాయకులపేట లో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పగల్పత్తు రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం పదవరోజు రాపత్తు ఉత్సవం సందర్భంగా నమ్మాళ్వార్ కు మోక్ష ప్రాప్తి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. దేవస్థాన అర్చకులు కిడాంబి శ్రీరామ్ ,కిడాంబి సంపత్ నారాయణ, కిడాంబి రామానుజాచార్యులు, సుదర్శనాచార్యుల, ప్రధాన తీర్థ కార్లు తిరుమల వింజమూరు నరసింహాచార్యులు ,పలువురు శ్రీ వైష్ణవ స్వాములు భక్త బృందం ఘనంగా స్వామివారిని […]

రంగనాథ స్వామి దేవాలయంలో ఘనంగా అధ్యయనోత్సవాలు

శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం నెల్లూరు ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందు జరిగే పదిరోజుల అధ్యయనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆళ్వారులు పాడిన దివ్య ప్రబంధాన్ని పారాయణ చేయడంతోపాటు స్వామివారికి విశేష అలంకరణలు, కార్యక్రమాలను చేశారు. ముగింపు సమయంలో ఆళ్వారులకు అరుళప్పాడు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఇతర ప్రముఖులతోపాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

ఆచార్య పురుష అగ్రగణ్యులు తిరుమలనంబి

పితామహస్యాపి పితామహాయ ప్రాచేతదేశ ఫలప్రదాయశ్రీభాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్‌తిరుమలక్షేత్ర ప్రథమపౌరుడిగా ఆచార్య పురుష అగ్రగణ్యుడిగా పేరొందిన శ్రీశైలపూర్ణులు అనే తిరుమల నంబి భగవద్రామానుజాచార్యులవారికి సాక్షాత్తు మేనమామ. శ్రీవారికి దాదాపు 1020 సంవత్సరాలముందు తీర్థ కైంకర్యం, పుష్పకైంకర్యం, మంత్రపుష్ప కైంకర్యం, వేదపారాయణ కైంకర్యం, ఇలా ఎన్నో ఎన్నెన్నో కైంకర్యాలను నిర్వహించిన మహనీయులు. అందుకే తిరుమల పేరు చెప్పినపుడు తిరుమలనంబి గుర్తుకువస్తారు. అదే విధంగా తిరుమలనంబి పేరు చెప్పినపుడు తిరుమలక్షేత్రం గుర్తుకు వస్తుంది. అట్టి అవినాభావ సంబంధం తిరుమలకి […]