Paramparaa – The Tradition Continues…

నృసింహస్వామి 32 స్వరూపాలు….

నృసింహస్వామి 32 స్వరూపాలు…. భక్తులకు విశ్వాసాన్నీ … శత్రువులకు భయాన్ని కలిగించడం కోసం శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారం శ్రీనరసింహస్వామి అవతారం. ప్రహ్లాదుడిని హిరణ్య కశిపుడు నుంచి కాపాడిన అవతారం శ్రీ నృసింహావతారం. అలా భూమిపై ఆవిర్భవించిన నరసింహ స్వామి, అనేక స్వరూపాలతో తన భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. లక్ష్మీ నరసింహస్వామి .. యోగానంద నరసింహస్వామి … జ్వాలా నరసింహస్వామి … ప్రహ్లాద సమేత నరసింహస్వామిగా ఆయన వివిధ క్షేత్రాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి నరసింహస్వామి 32 స్వరూపాలని […]

కమనీయం సీతారాముల కళ్యాణం…

శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం! సీతాపతిం రఘుకులాన్వయ రత్నద్వీపం ఆజానుబాహు అరవింద దళాయతాక్షం! రామం నిశాచర వినాశకరం నమామి!! అంటూ దివ్యపురుషుణ్ణి భక్తి మనస్సుతో ఆరాధించుకునే పుణ్యప్రదమైన రోజు శ్రీరామనవమి. ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉన్నది. చైత్ర శుద్ధ నవమి. పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు పుట్టాడు. చిత్రమేమిటంటే ఆ పుట్టినరోజే అంటే ఆయా తిథి వార నక్షత్రాల్లోనే ఆయనకు వివాహం జరిగింది. పట్టాభిషేకం జరిగిన శుభసమయం కూడా ఇదే కావడం విశేషం. దీంతోపాటు జగదేకమాత సీతాదేవి తన కళ్యాణప్రదమైన […]

నెల్లూరు అయ్యప్ప గుడిలో దసరా వేడుకలు

నెల్లూరు నగరం వేదయపాలెం అయ్యప్ప గుడి లో వేంచేసియున్న శ్రీ గురువాయూర్ మహావిష్ణు దేవస్థానం నందు ఆదివారం దేవి శరన్నవరాత్రుల సప్తమి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సరస్వతి అలంకారం ఉత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ఆలయ అధ్యక్ష కార్యదర్శులు గూడల శేషగిరిరావు, కత్తుల వెంకటరత్నం గడ్డం రత్నయ్య, కత్తి మోహన్రావు ,బొగ్గుల మురళీమోహన్ రెడ్డి పలువురు భక్తులు ఆలయ ప్రధాన అర్చకులు అద్దంకి నరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

నెల్లూరులో హంస, సింహ వాహనంపై
కనువిందు చేసిన వేదాంత దేశికులు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ 26వ తేదీ సోమవారంనాడు శ్రీ వేదాంత దేశికులవారికి హంసవాహన ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కడాంబి సంపత్‌ గోపాలన్‌ వ్యవహరించారు. సెప్టెంబర్‌ 27వ తేదీ మంగళవారం సాయంత్రం సింహవాహనంపై శ్రీ దేశికులవారిని ఊరేగించారు. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కడాంబి క్రిష్ణస్వామి కుటుంబం వారు ఉన్నారు.ఈ కార్యక్రమంలో అర్చకులు విజయసారథి, […]

నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన ఆదివణ్‌ శఠగోప యతీంద్రుల ఉత్సవాలు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో అహోబిలమఠం వ్యవస్థాపకులు శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప స్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు సెప్టెంబర్‌ 22 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఆలయ మేనెజింగ్‌ ట్రస్టీలు, సభ్యులు, అర్చకులు, పెద్దలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అందరూ ఈ ఉత్సవాలకు వచ్చి ఆచార్యులవారి కరుణ కటాక్షాలను పొందాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.

నెల్లూరులో 22 నుంచి ఆదివణ్‌ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

నెల్లూరులో 22 నుంచి ఆదివణ్‌ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప యతీర్రదునికి, శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్‌ 22 నుంచి 30వ తేదీ వరకు శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప స్వామికి ఆస్థాన ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఉభయకర్తలుగా ఖతార్‌లో ఉంటున్న శ్రీమాన్‌ నారాయణన్‌, శ్రీమతి ఇందిర, […]

గురువాయూరప్పన్‌ టెంపుల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

న్యూజెర్సిలోని శ్రీ గురువాయూరప్పన్‌ టెంపుల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా వాహన సేవతోపాటు ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని పిల్లలు శ్రీకృష్ణుని వేషధారణలో కనిపించి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రముఖులతోపాటు, పండితులు, భక్తులు పాల్గొన్నారని పవన్‌ రాళ్ళపల్లి తెలియజేశారు.