వైభవంగా జరిగిన పరంపర వెబ్‌సైట్ వార్షికోత్సవం
గత సంవత్సరం గరుడపంచమి రోజున ప్రముఖ పండితులచేత శాస్త్రోక్తంగా ప్రారంభించిన ‘పరంపర’ వెబ్‌సైట్ వార్షికోత్సవ సంబరాలను డిసెంబర్ 3వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆన్ లైన్ వేదికగా ఏర్పాటు చేసిన సంబరాల్లో ప్రముఖ పండితులు పాల్గొని పరంపర.ఇన్ వెబ్ సైట్ ఈ ఏడాదికాలంలో చేసిన విజయాలను ప్రశంసిస్తూ, భవిష్యత్తుల్లో మరిన్ని కార్యక్రమాలతో వైష్ణవులను అలరించాలని ఆశీర్వదించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా న్యూయార్క్‌లోని పొమానా రంగనాధ స్వామి టెంపుల్ జీయర్ స్వామి శ్రీమద్ పరమహంస […]
న్యూయార్క్ శ్రీరంగనాధ దేవాలయంలో వైభవంగా శ్రీకృష్ణ జయంతి
న్యూయార్క్‌లోని పొమనాలో ఉన్న శ్రీరంగనాధ స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి అభిషేకం ఇతర కార్యక్రమాలను వైభవంగా చేశారు. శ్రీకృష్ణదేశిక జీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎంతోమంది భక్తులు పాల్గొన్నారు. vandhe Brundhaavana-charam Vallavii-jana-Vallabham Jayanthii Sambhavam Dhaama Vaijayanthii vibhuushaNam Bhagavaan Sri-Krishna at Sri RanganaaTha Temple, New-York, USA,
శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం
శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం ` నియమములు మునిత్రయ సంప్రదాయం: 1. శ్రీ జయంతి రోజు పూర్తిగా ఉపవాసము ఉండవలెను. ఉపవాసం ఉండలేనిపక్షంలో రాత్రి తిరువారాధనం చేయు వరకు ఉపవాసముండి, తిరువారాధనము చేసిన తరువాత స్వామికి సమర్పించిన నైవేద్యం, చేసిన వెన్న, పాలు, మొదలగునవి స్వీకరించవచ్చును. ఇది కూడా సాధ్యం కానివారు పగటి పూట ఏకాదశి వలే పలహార వ్రతం చేయవచ్చును. ఎటువంటి కారణము చేతను అన్న ప్రసాదము స్వీకరించకూడదు. 2. […]
తిరుచానూరులో పంచాంగశ్రవణం చేసిన శ్రీమాన్ రంగనాధన్ స్వామి
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని వివిధ దేవాలయాల్లో పంచాంగ శ్రవణం, ఇతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తిరుచానూరులోని శ్రీ శ్రీనివాసస్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో శ్రీమాన్ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్ స్వామి పాల్గొని పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
కారడయార్ వ్రతమ్ (సావిత్రి నోము వ్రతం)
కారడయార్ వ్రతమ్ (సావిత్రి నోము వ్రతం) మార్చి(2022) నెల 14వ తేదీ సోమవారం మన సంస్కృతిలో ఎన్నో పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు కనిపిస్తాయి. ఒక్కో పండుగ, ఆచారం వెనుక మన సంక్షేమం కనిపిస్తుంటుంది. అలాగే వివాహిత మహిళలు తమ భర్త క్షేమాన్ని కాంక్షిస్తూ ఓ వ్రతాన్ని ఆచరిస్తారు. అదే కారడయార్ వ్రతమ్, ’సావిత్రి నోము వ్రతం’ అని కూడా పేర్కొంటారు. ఈ వ్రతం వివాహిత మహిళలకు ముఖ్యమైన పండుగ. ఈ రోజున, మహిళలు తమ భర్తల దీర్ఘాయువు […]
అహోబిలమఠం యుఎస్‌ఎ ఆధ్వర్యంలో ఘనంగా అధ్యయనోత్సవాలు
అహోబిలమఠం యుఎస్‌ఎ ఆధ్వర్యంలో అధ్యయనోత్సవాలను టెక్సాస్‌లోని శ్రీ గురువాయూరప్పన్ దేవాలయంలో డిసెంబర్ 22 నుంచి 31వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవనీత కృష్ణునికి వివిధ అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు చేశారు. గరుడవాహనంపై ఉన్న శ్రీకృష్ణుడిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఈ సందర్భంగా ప్రబంధ పండితులు ఆళ్వారులు అనుగ్రహించిన నాలాయిర దివ్య ప్రబంధాన్ని సేవించారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
పాదుకా సేవకులు … కవితార్కిక సింహులు
‘నభస్యమాసి శ్రోణాయాం అనంతార్య గురూద్భవమ్। శ్రీ వేంకటేశ ఘంటాంశం వేదాంతగురుమాశ్రయే ॥ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీనివాసుని దివ్యఘంటావతారంగా అనంత సూరి సుతునిగా ప్రసిద్ధిగాంచిన వేదాంత దేశికులను నేను ఆశ్రయిస్తున్నాను.’ వేంకటేశావతారోయం తత్‌ఘంటాంశోథవాభవేత్। యతీంద్రాంశోధవేత్యేవం వితర్క్యాయాస్తుమంగళం॥ శ్రీ దేశిక తనయ కుమారవరదాచార్యుల శ్రీసూక్త్యనుసారం ‘శ్రీ వేంకటేశ్వరులు, ఆయన ఘంట మరియు భగవత్ రామానుజులు’ ఈ మువ్వురి అవతారమే వేదాంతదేశికావతారం అని సుస్పష్టంగా తెలుస్తోంది. శ్రీ వేంకటేశ సుప్రభాత రచయిత, శ్రీవేదాంతదేశికుల నుండి ‘ప్రతివాదిభయంకర’ అనే బిరుదును స్వీకరించిన ప్రతివాది […]
సంప్రదాయ భోజన విధి
మన సంప్రదాయంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అందులో భోజన విధానం ఒకటి. భోజనం చేసే ముందు. చేసే సమయంలో, చేసిన తరువాత ఎలా వ్యవహరించాలో శాస్త్రంలో పేర్కొన్నారు. మనం భోజనం చేసేటప్పుడు పంచభూతాలను, భగవంతుడిని సంతృప్తిపరిచి మనం భుజించాలని చెబుతారు. భోజన విధానంలో పేర్కొన్న విషయాలు మొత్తంగా 20 ఉన్నాయి. అందులో భోజనానికి ముందు 8 విధానాలను పాటించాలి. అందులో మొదటిది1) అతిధిరాకకోసం చూడటం – గృహస్థ ధర్మం ప్రకారము, తాను భుజించుటకు ముందు ప్రతిరోజు ఎవరైన అతిథి వస్తారా అని ఎదురు చూసి భోజనం చేయవలెను.2) ఆచమనం – భోజనమునకు ముందుగా […]
మహాభక్తుడు పోతన
పదునైదవ శతాబ్ధమున తెలుగు సాహిత్యాకాశమున దేదీప్యమానముగా సూర్యునివలె వెలిగినవాడు శ్రీనాథ మహాకవి. ఉత్తరార్థమున చల్లని వెన్నెలలు విరియించిన చంద్రునివంటి వాడు పోతన. పోతన మహాభక్తుడు. కవిత్వ పాండిత్యము ఆయనను సహజముగా వరించినవి. రాజాశ్రయమునకు దూరంగా ఉండి సాధారణ కర్షక జీవితము అవలంబించి తెలుగునాట భాగవత కల్పతరువును నాటిన మహాకవి పోతన. తెలుగుజాతికి తెలుగు కవిత్వమునకు సుకృతము పంటలాగా పోతన కవిత్వాలు నిలిచాయి. ప్రాచీన సాహిత్యమంతటిలో రెండే రెండు కృతులు పేర్కొనవలసి వచ్చినచో ఒకటి కవిత్రయము వారి భారతము, […]