ఘనంగా తిరుమలనంబి అవతార మహోత్సవం

తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి ఆధ్వర్యములో1050వ తిరుమల నంబి అవతార మహోత్సవములు తిరుమల దక్షిణ మాడవీధిలో ఉన్న తిరుమలనంబి ఆలయంలో ఘనంగా జరిగింది. తిరుమలనంబి వంశీయులు, ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధికారులు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు, ప్రముఖ పండితులు హాజరయ్యారు. పండితులు ఈ సందర్భంగా చేసిన ఉపన్యాసాలు అందరినీ అలరించాయి. సంస్కృత విద్యాపీఠం ప్రొఫెసర్ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్, తిరుమల నంబి వంశీయులు శ్రీ కణ్ణన్ ఆధ్వర్యంలో జరిగిన […]
యజుర్ ఉపాకర్మ – సమిదాధానము

సమిదాధానము శుభ్రంగా స్నానమాచరించి ఊర్ధ్వపుండ్రము ధరించి సంధ్యా వందనము ఆచరించి మరల కాళ్ళు చేతులు శుభ్రముగా కడుగుకొని రెండు సార్లు ఆచమనం ప్రాణాయామంచేసి సంకల్పం చేసుకొనవలెను. ప్రాయశ్చిత్తము చేయడంకోసం యజ్ఞో పవీతము ధరించ వలెను. కావలసిన వస్తులు;:- ధర్భలు, సమిధలు, చెక్క దొప్పలు, చెంఋ స్థాలీ(పంచపాత్ర), ఔపాసన అగ్ని గుండం భూర్బవస్సువః అని ప్రోక్షణ చేసి, కూర్చోని ఆచమనం, (2సార్లుచేసి) పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2ధర్భల ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను. అస్మత్ […]
దక్షిణాయన పుణ్య కాలం కటక సంక్రమణం
వృషభ (వైగాశి)సంక్రమణం15.05.2023

అథ , ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య , త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్ గురుభ్యో నమ: శ్రీమాన్ వేంకట నాధార్యః కవితార్కిక కేసరి! వేదాంతాచార్య వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య: తత్‌గురుభ్యశ్చ నమోవాకం అధీమహీ వృణీమహేచ, […]
21-03-2023 పంగుణి(మీన)అమావాస్య

అథ , ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య , త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్ గురుభ్యో నమ: శ్రీమాన్ వేంకట నాధార్యః కవితార్కిక కేసరి! వేదాంతాచార్య వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య: తత్‌గురుభ్యశ్చ నమోవాకం అధీమహీ వృణీమహేచ, […]
వైభవంగా జరిగిన పరంపర వెబ్‌సైట్ వార్షికోత్సవం

గత సంవత్సరం గరుడపంచమి రోజున ప్రముఖ పండితులచేత శాస్త్రోక్తంగా ప్రారంభించిన ‘పరంపర’ వెబ్‌సైట్ వార్షికోత్సవ సంబరాలను డిసెంబర్ 3వ తేదీన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆన్ లైన్ వేదికగా ఏర్పాటు చేసిన సంబరాల్లో ప్రముఖ పండితులు పాల్గొని పరంపర.ఇన్ వెబ్ సైట్ ఈ ఏడాదికాలంలో చేసిన విజయాలను ప్రశంసిస్తూ, భవిష్యత్తుల్లో మరిన్ని కార్యక్రమాలతో వైష్ణవులను అలరించాలని ఆశీర్వదించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా న్యూయార్క్‌లోని పొమానా రంగనాధ స్వామి టెంపుల్ జీయర్ స్వామి శ్రీమద్ పరమహంస […]
న్యూయార్క్ శ్రీరంగనాధ దేవాలయంలో వైభవంగా శ్రీకృష్ణ జయంతి

న్యూయార్క్‌లోని పొమనాలో ఉన్న శ్రీరంగనాధ స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణునికి అభిషేకం ఇతర కార్యక్రమాలను వైభవంగా చేశారు. శ్రీకృష్ణదేశిక జీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఎంతోమంది భక్తులు పాల్గొన్నారు. vandhe Brundhaavana-charam Vallavii-jana-Vallabham Jayanthii Sambhavam Dhaama Vaijayanthii vibhuushaNam Bhagavaan Sri-Krishna at Sri RanganaaTha Temple, New-York, USA,
శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం

శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం ` నియమములు మునిత్రయ సంప్రదాయం: 1. శ్రీ జయంతి రోజు పూర్తిగా ఉపవాసము ఉండవలెను. ఉపవాసం ఉండలేనిపక్షంలో రాత్రి తిరువారాధనం చేయు వరకు ఉపవాసముండి, తిరువారాధనము చేసిన తరువాత స్వామికి సమర్పించిన నైవేద్యం, చేసిన వెన్న, పాలు, మొదలగునవి స్వీకరించవచ్చును. ఇది కూడా సాధ్యం కానివారు పగటి పూట ఏకాదశి వలే పలహార వ్రతం చేయవచ్చును. ఎటువంటి కారణము చేతను అన్న ప్రసాదము స్వీకరించకూడదు. 2. […]
తిరుచానూరులో పంచాంగశ్రవణం చేసిన శ్రీమాన్ రంగనాధన్ స్వామి

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని వివిధ దేవాలయాల్లో పంచాంగ శ్రవణం, ఇతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తిరుచానూరులోని శ్రీ శ్రీనివాసస్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో శ్రీమాన్ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్ స్వామి పాల్గొని పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు.
కారడయార్ వ్రతమ్ (సావిత్రి నోము వ్రతం)

కారడయార్ వ్రతమ్ (సావిత్రి నోము వ్రతం) మార్చి(2022) నెల 14వ తేదీ సోమవారం మన సంస్కృతిలో ఎన్నో పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు కనిపిస్తాయి. ఒక్కో పండుగ, ఆచారం వెనుక మన సంక్షేమం కనిపిస్తుంటుంది. అలాగే వివాహిత మహిళలు తమ భర్త క్షేమాన్ని కాంక్షిస్తూ ఓ వ్రతాన్ని ఆచరిస్తారు. అదే కారడయార్ వ్రతమ్, ’సావిత్రి నోము వ్రతం’ అని కూడా పేర్కొంటారు. ఈ వ్రతం వివాహిత మహిళలకు ముఖ్యమైన పండుగ. ఈ రోజున, మహిళలు తమ భర్తల దీర్ఘాయువు […]