Paramparaa – The Tradition Continues…

నెల్లూరు దేశికులవారి దేవాలయంలో తమిళ ఉగాది వేడుకలు

నెల్లూరులోని రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంతదేశికులవారి ఆలయంలో తమిళ ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష తిరుమంజనం ఇతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శుభకృత్‌ నామ సంవత్సరం అందరికీ శుభాన్ని కలగజేయాలని ఈ సందర్భంగా స్వామివారిని వేడుకున్నట్లు ఆలయ మేనేజింగ్‌ ట్రస్టీ కేసి వరదరాజన్‌ తదితరులు తెలిపారు.

స్వర్ణకిరీటంతో సాక్షాత్కరించిన శ్రీరంగనాధుడు

న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీరంగనాధ స్వామి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీరంగనాధునికి పంగుణి రేవతి తిరునక్షత్ర దినోత్సవంను పురస్కరించుకుని భక్తులు సమర్పించిన బంగారు కిరీటాన్ని అలంకరించారు. స్వర్ణకిరీటంతో మెరుస్తూ, తన కరుణాకటాక్షాలతో భక్తులను ఆశీర్వదిస్తున్న శ్రీరంగనాధుడిని సేవించేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉగాది పండుగ సందర్భంగా స్వామివారికి విశేష సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. భక్తుల సహకారంతోనే తాము స్వర్ణకిరీటాన్ని స్వామివారికి అలంకరించినట్లు శ్రీకృష్ణ దేశిక జీయర్‌ స్వామి తెలిపారు.

పంగుని( మీన ) అమావాస్య

పంగుని( మీన ) అమావాస్య 31-03-2022 రెండు సార్లు ఆచమనం ,ప్రాణాయామం. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః.   సర్వపరిచ్చదైః విధాతుం ప్రీతం ఆత్మానమం దేవః  ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం! ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నో పశాన్తయే.!! యస్యద్విరద విక్త్రాద్యాః  పారిషద్యాః  పరశ్శతమ్‌! విఘ్నం నిఘ్నంన్తి […]

కారడయార్‌ వ్రతమ్‌ (సావిత్రి నోము వ్రతం)

కారడయార్‌ వ్రతమ్‌ (సావిత్రి నోము వ్రతం) మార్చి(2022) నెల 14వ తేదీ సోమవారం  మన సంస్కృతిలో ఎన్నో పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు కనిపిస్తాయి. ఒక్కో పండుగ, ఆచారం వెనుక మన సంక్షేమం కనిపిస్తుంటుంది. అలాగే వివాహిత మహిళలు తమ భర్త క్షేమాన్ని కాంక్షిస్తూ ఓ వ్రతాన్ని ఆచరిస్తారు. అదే కారడయార్‌ వ్రతమ్‌, ’సావిత్రి నోము వ్రతం’ అని కూడా పేర్కొంటారు. ఈ వ్రతం వివాహిత మహిళలకు ముఖ్యమైన పండుగ.  ఈ రోజున, మహిళలు తమ భర్తల దీర్ఘాయువు […]

திருமங்கையாழ்வாரின் மகத்தான பாசுரங்கள்

திருமங்கையாழ்வார் அருளிச்செய்த பெரிய திருமடலை கீழ்கண்ட பாசுரங்கள் வழியாக பார்ப்போமா? பாசுரம்-9 உளதென்னில் மன்னுங் கடுங்கதிரோன் மண்டலத்தின் நன்னடுவுள் அன்னதோர் இல்லியின் ஊடுபோய். பாசுரம்-10 வீடென்னும் தொன்னெறிக்கண் சென்றாரைச் சொல்லுமின்கள் சொல்லாதே. அன்னதே பேசும் அறிவில் சிறு மனத்து ஆங்கு அன்னவரைக் கற்பிப்போம் யாமே. வீடு பேறு என்ற ஒன்று உண்டென்னின், எக்காலத்தும் வெப்பம் மிக்க ஒளிக்கதிர்களையுடைய சூரிய மண்டலத்தின் நடுவே சென்று,அங்குள்ள மிகவும் நுணுக்கமான ஓட்டை வழியே,  வீடுபேறு என்று சொல்லப்படுகின்ற இடத்துக்குச் சென்றவர்கள் இன்னின்னார் […]