Paramparaa – The Tradition Continues…

గురువాయూరప్పన్‌ టెంపుల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

న్యూజెర్సిలోని శ్రీ గురువాయూరప్పన్‌ టెంపుల్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా వాహన సేవతోపాటు ఇతర కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని పిల్లలు శ్రీకృష్ణుని వేషధారణలో కనిపించి అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రముఖులతోపాటు, పండితులు, భక్తులు పాల్గొన్నారని పవన్‌ రాళ్ళపల్లి తెలియజేశారు.

హయగ్రీవస్వామివారి డోలోత్సవం 11-08-2022

శ్రావణ పూర్ణిమ మరియు శ్రీహయగ్రీవ జయంతి సందర్భంగా 11 -08 -2022 తేదీన, శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధి వీధిలోని శ్రీ పరకాల మఠంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారికి క్రొత్తగా బహూకరించిన డోలై (ఉయ్యాల)లో శ్రీ లక్షీహయగ్రీవ స్వామి వారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రము 4.00 గంటలకు జరిగే ఈ డోలోత్సవంలో భక్తులంతా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వాలని కోరుతున్నాము.

గ్రేటర్‌ చికాగో హిందూ టెంపుల్‌లో ఘనంగా శ్రీరామ పుష్కరోత్సవం

గ్రేటర్‌ చికాగోలోని హిందూ టెంపుల్‌లో శ్రీరామ దేవాలయం ఏర్పాటు చేసి 36 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పుష్కరోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రామతారకహోమం, నక్షత్రం హోమం, కలశోద్దారక హోమం వంటివి శాస్త్రోకంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ పండితుడు పవన్‌ రాళ్ళపల్లి తెలియజేశారు.

శ్రీనివాసుని చిరు మందహాసం

మనకి తిరుమల ఆనంద నిలయం లోని శ్రీనివాసుని నిశితంగా గా దర్శించే అదృష్టం దొరకదు గానీ ఆ స్వామి ఎంతో అందంగా ఉంటాడు…సృష్టి మొత్తం లోని అందం ఆ స్వామి లోనే ఉంది…అందుకే మనం అందరం ఆ స్వామి వైపు అంతగా ఆకర్షింప బడతాము…ఎప్పుడెప్పుడు వెళ్లి స్వామిని దర్శించు దామా అని మనస్సు ఒకటే కొట్టుకుంటుంది… ఇక ఆ స్వామి చిరు నవ్వు అయితే వేయి నాలుకలు వున్న ఆ ఆదిశేషుడు కూడా వర్ణించలేని సౌందర్యం …స్వామి […]

శ్రీ  మహాలక్ష్మి మహా వైభవ  ఆవిర్భావం 

ఈశానాం జగతోస్య వేంకటపతే ర్విష్టోః పరాం ప్రేయసీం తద్వక్షః స్థల నిత్యవాసరసికాం తత్‌క్షాంతి సంవర్ధినీమ్‌ పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో వెలసిన శ్రీనివాసుని హృదయంలో  నివసిస్తూ ఆ స్వామికి అత్యంత ప్రియురాలై అలరారుతూ, పద్మాసనంలో వేంచేసి  సుకుమారమైన చేతులలో పద్మాలను అలంకారంగా ధరిస్తూ భక్తులందరినీ  అనుగ్రహిస్తున్న శ్రీ మహాలక్ష్మికి ఇవే మన నమస్కారములు.  సంపూర్ణ విశ్వంలో  సకల శుభాలను అనుగ్రహించేది, సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది, […]

జూలై 1 నుంచి న్యూయార్క్‌లో శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు

న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీరంగనాథ స్వామి దేవాలయంలో జూలై 1 నుంచి 10 రోజులపాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు.జూలై 1వ తేదీన ఉదయం 10 గంటలకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, సాయంత్రం 5 గంటలకు విష్వక్సేన ఆరాధనం, మృత్‌సంగ్రహణ రక్షా బంధన, అంకురార్పణ, శ్రీ గరుడ ఆధీవాసం, హోమం, వేదం, నాలాయిర దివ్యప్రబంధ పారాయణ తొడక్కం జరుగుతాయి.జూలై 2వ తేదీన ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, గరుడ ప్రసాద వితరణ, 11 గంటలకు శేషవాహన సేవ, మహా […]

శ్రీవారి పాదాల చెంత పుట్టిన సువర్ణ ముఖి నది

మహా తపస్సంపున్నుడు అయిన శ్రీ అగస్త్య మహర్షుల వారు దక్షిణ భారతానికి వచ్చినప్పుడు అనేక పరమేశ్వర లింగాలను ప్రతిష్టింప చేశారు…మనం గోదావరీ నదీ తీర ప్రాంతాలలో అనేక చోట్ల అగస్త్యుల వారు ప్రతిష్టించిన అనేక శివా లయాలను చూడవచ్చును.అలా అగస్త్య మహర్షుల వారు చంద్రగిరి ప్రాంతానికి వచ్చి అక్కడ పక్కనే వున్న తిరుమల కొండల పవిత్రతకు , ప్రకృతి సంపదకు ఎంతో ఆశ్చర్య పడి అక్కడే దగ్గరలోనే ఆశ్రమం నిర్మించుకుని ఉండాలని నిర్ణయించుకున్నారు…అదే నేటి అగస్త్యాశ్రమం…ఈ ఆశ్రమం […]

స్వర్ణకిరీటంతో సాక్షాత్కరించిన శ్రీరంగనాధుడు

న్యూయార్క్‌లోని పొమానాలో ఉన్న శ్రీరంగనాధ స్వామి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీరంగనాధునికి పంగుణి రేవతి తిరునక్షత్ర దినోత్సవంను పురస్కరించుకుని భక్తులు సమర్పించిన బంగారు కిరీటాన్ని అలంకరించారు. స్వర్ణకిరీటంతో మెరుస్తూ, తన కరుణాకటాక్షాలతో భక్తులను ఆశీర్వదిస్తున్న శ్రీరంగనాధుడిని సేవించేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉగాది పండుగ సందర్భంగా స్వామివారికి విశేష సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. భక్తుల సహకారంతోనే తాము స్వర్ణకిరీటాన్ని స్వామివారికి అలంకరించినట్లు శ్రీకృష్ణ దేశిక జీయర్‌ స్వామి తెలిపారు.

 ఆశ్రితజన రక్షకుడు

మనలో చాలా మందికి తిరుమల వెళ్ళినప్పుడు లభించేది కేవలం ఒక్క సెకను దర్శనమే ! ఎవరో కొందరు అదృష్ట వంతులు మాత్రం బ్రేక్ దర్శనం లో వెళ్తారు…అయితే చాలా మంది అనుకుంటారు అసలు ఈ సెకను టైం లో ఆ స్వామి నా కష్టాలు విన్నాడా అని…స్వామి కి నా కష్టాలు చెప్పుకునే టైం దొరకలేదు అని బాధ పడతాముం…ఒక్క విషయం గుర్తుంచుకోండి…స్వామి వారిని మనం ఎంత సేపు చూసాము అన్నది కాదు ప్రశ్న…స్వామి మనల్ని చూసాడా […]

శ్రీనివాసుడు బహిర్గతం చేసిన అన్నమయ్య కీర్తనలు

ఈరోజు మనం ఇన్ని అన్నమయ్య కీర్తనలు పాడుకుంటున్నాము అంటే ఇవి లోకానికి తెలియ చేసింది పరోక్షంగా శ్రీనివాసుడు…ప్రత్యక్షంగా మహానుభావులు శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారూనూ… 1889 డిసెంబర్ లో జన్మించిన   శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహంత్ ప్రయాగ్ దాస్ వారి వద్ద సహాయకులుగా వుండే వారు…వీరు epigraphy లో ట్రైనింగ్ తీసుకుని తిరుమల ఆలయం లోని అనేక శాసనాలను ఇంగ్లీష్ లోకి తీసుకు వచ్చారు..ఆరోజుల్లో తిరుమల ఆలయం మహంతుల ఆధీనం లో ఉండేది. శ్రీ […]