కంభరాజపురం మురళీ అయ్యంగార్, టి.కె ముకుందన్‌కు అవార్డుల ప్రదానం
శ్రీరంగంలోని దేశికర్ సన్నిధిలో జరిగిన శ్రీ నాథమునుల 1200వ తిరునక్షత్ర మహోత్సవంలో శ్రీ పౌండరీకపురం ఆండవన్ స్వామివారు పండితులను ఘనంగా సన్మానించారు. తిరుపతికి చెందిన కంభరాజపురం మురళీ అయ్యంగార్‌ను అధ్యాపకరత్న చూడామణి అవార్డుతో, తిరుమలనంబి వంశీయులైన టి.కె. ముకుందన్‌ను ఆచార్య కైంకర్యరత్నచూడామణి అవార్డుతోనూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దివ్య ప్రబంధ పారాయణం, వివిధ కార్యక్రమాలను వైభవంగా జరిపారు. ఈ వేడుకల్లో ఆండవన్ స్వామి మాట్లాడుతూ, నాధమునులు పెరుమాళ్ళకు చేసిన కైంకర్యం, వైష్ణవలోకానికి చేసిన సేవలను తెలియజేశారు.తిరుపతిలోని […]
Telugu Ugadi Calendar
tiruppavai
శ్రావణ పూర్ణిమ – 30/08/2023
శోభ కృత్ సంవత్సరం – 2023 యజుర్ ఉపాకర్మ – ఆవణి అవిట్టమ్ శ్రావణ పూర్ణిమ – 30/08/2023 గాయత్రీ జపం – 31/08/2023 శుభ్రంగా స్నానమాచరించి ఊర్ధ్వపుండ్రము ధరించి సంధ్యా వందనము ఆచరించి మరల కాళ్ళు చేతులు శుభ్రముగా కడుగుకొని రెండు సార్లు ఆచమనం ప్రాణాయామంచేసి సంకల్పం చేసుకొనవలెను. ప్రాయశ్చిత్తము చేయుటవలన యజ్గోపవీతము ధరించ వలెను. కావలసిన వస్తులు;:- ధర్భలు,సమిధలు,చెక్క దొప్పలు,చెంఋ స్థాలీ(పంచపాత్ర),ఔపాసన అగ్ని గుండం భూర్బవస్సువః అని ప్రోక్షణ చేసి, కూర్చోని ఆచమనం, (2సార్లుచేసి) […]
కడాంబి శేషాచారి చెల్లస్వామి శతమాన మహోత్సవం
నెల్లూరులోని సంతానం బుక్స్ వ్యవస్థాపకలు, ఉభయ వేదాంత కడాంబి వేంకటాచారి (చెల్లస్వామి) (1923-2023) శతమాన మహోత్సవం వేడుకలను నెల్లూరులోని రంగనాయకులపేటలో గోపురం వీధిలో ఉన్న శాంత నివాస్‌లో వైభవంగా జరపనున్నారు. 2రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా మొదటిరోజు అనగా 20-02-2023, సోమవారం సాయంత్రం 5-00గంటలకు వేద దివ్య ప్రబంధ, ఇతిహాస, పురాణ పారాయణములు ప్రారంభించనున్నారు. మరుసటిరోజు అనగా తేది 21-12-2023 మంగళవారంనాడు ‘‘శతమాన మహోత్సవం’’ ‘‘సుదర్శన హోమం’’తో పాటు ‘‘శాత్తుమొర కార్యక్రమాలు జరుగుతుందని కడాంబి సంతానం […]
పి.సి. రామానుజం స్వామికి శతాభిషేక మహోత్సవం
తిరుపతిలో ఉ.వే. కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్ శిష్యులలో సీనియర్‌గా ఉన్న శ్రీమాన్ పి.సి. రామానుజంగారి శతాభిషేకం సందర్భంగా పలువురు మిత్రులు, శేషాద్రి అయ్యంగార్ శిష్యులు ఆయనకు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. శ్రీమాన్ కంభరాజపురం మురళీ అయ్యంగార్, ఉ.వే. చక్రవర్తి రంగనాధన్, గోవిందరాజన్, శ్రీనివాసన్, సతీష్, బాలాజీ తదితరులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. 23వ తేదీన తిరుపతిలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో ఆయన శతాభిషేక మహోత్సవం జరగనున్న్దది. ఈ కార్యక్రమంలో భాగంగా 20వ తేదీన వేదపారాయణం ఆయన స్వగృహంలో […]
ఘనంగా నడాదూర్ చక్రపాణి అయ్యంగార్ శతజయంతి వేడుకలు
శ్రీవైష్ణవ సాంప్రదాయ అనుష్టానపరులు, శ్రీమన్నారాయణుని పరమ భక్తాగ్రేసరులు, నడాదూర్ వంశోద్ధారకులు, మహారాజశ్రీ కేశవాచారి వారి ప్రియ పుత్రులు, పితృదేవుల సేవకై నెల్లూరులోనే నివాసముండిన శ్రీమాన్ నడాదూర్ చక్రపాణి అయ్యంగార్ వారి శతజయంతి వేడుకలను నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. వారి వంశీయులు నెల్లూరులోని శ్రీ వేదాంతదేశికుల దేవాలయానికి ఎంతో కైంకర్యం చేసినవాళ్ళు. చక్రపాణి అయ్యంగార్ నిరంతర సుందరకాండ పారాయణులు, నిత్యం రామాయణ పురాణ గ్రంథ పాఠనా దురంధరులు, పరమ భాగవతోత్తములుగా పేరు పొందారని శ్రీమాన్ వరదరాజన్‌గారు పేర్కొన్నారు.
వేంకట రామ విరచితం
దొంగ నగవుల నాపవోయి, మా మదుల దోచే,ఓ మా దొంగ కృష్ణుడ,తిరు వేంకట కృష్ణుడ//దొంగ//దొంగ వోలే మా ఇండ్ల దూరి, వెదకి,వెదకి వెన్నల దొంగ లించి తిన మరిగి,దొర వోలే తిరుగాడ నేర్చిన ఓ,మా గోపల్లె దొంగ బాల కృష్ణుడ//దొంగ//దొంతర,దొంతరల గోప వనితల వలువల దొంగలిం పుల సేసి,చెట్టు మీద చేరి, చేతులెత్తి మ్రొక్కిన,తిరిగి ఇచ్చేననేటి,ఓ మా దొంగ బాల కృష్ణుడ//దొంగ//దొంగలింపుల సేయ మాని నట్టు,తిరు వేంకట గిరుల చేరి,తిరుమాడ వీధుల, ముద్దు సతులిద్దరి నడుమ, దొంగ […]
పంగుని( మీన ) అమావాస్య
పంగుని( మీన ) అమావాస్య 31-03-2022 రెండు సార్లు ఆచమనం ,ప్రాణాయామం. అస్మత్ గురుభ్యో నమ: శ్రీమాన్ వేంకట నాధార్యః కవితార్కిక కేసరి! వేదాంతాచార్య వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య: తత్‌గురుభ్యశ్చ నమోవాకం అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ దంపతీ జగతాంపతీ స్వశేష భూతేనమయ స్వీయైః. సర్వపరిచ్చదైః విధాతుం ప్రీతం ఆత్మానమం దేవః ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం! ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నో పశాన్తయే.!! యస్యద్విరద విక్త్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్! విఘ్నం నిఘ్నంన్తి […]
టిటిడి ప్రబంధ పారాయణ స్కీమ్‌లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
టిటిడి నాలాయిర దివ్య ప్రబంధ పారాయణ స్కీమ్‌లో 2021-22 సంవత్సరానికి గాను కేటగిరి -1, 2 మరియు పరిశీలకులుగా పనిచేసేందుకు నాలాయిర దివ్యప్రబంధం చదివిన దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవైష్ణవ బ్రాహ్మణుల నుండి రెండోసారి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. ఎంపికైన వారు నెలవారీ సంభావన ప్రాతిపదికన శ్రీవైష్ణవ ఆలయాల్లో నాలాయిర దివ్యప్రబంధం పారాయణం చేయాల్సి ఉంటుంది. www.tirumala.org వెబ్సైట్ నుండి దరఖాస్తులు పొందవచ్చు.