Paramparaa – The Tradition Continues…

శ్రీజయంతి ( జన్మాష్టమి)

1. శ్రీ జయంతి రోజు పూర్తిగా ఉపవాసము చేయవలెను. 2. అట్లు కానియెడల రాత్రి తిరువారాధనం చేయువరకు ఉపవాసముండి, తిరువారాధనము చేసిన తరువాత స్వామికి సమర్పించిన నైవేధ్యం చేసిన వెన్న, పాలు, మొదలగునవి స్వీకరించవచ్చును. 3. అదియు కానిచో  పగటిపూట ఏకాదశివలే పలహార వ్రతం చేయవచ్చును. 4. ఎటు వంటి కారణము చేతను అన్న ప్రసాదము స్వీకరించ కూడదు. మహా పాపము సంభవించును. 5. వ్రతనియమము అన్ని పాటించవలెను.  ( గంధం, తాంబూలం , శిఖాలంకారము చేయకూడదు) […]

 గాయత్రీ జపం  20-08-2024

ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని. (2ధర్భల  ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి  వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది . గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, తత్రాద్యౌ  దంపతీ  జగతాంపతీ స్వశేష  భూతేనమయ  స్వీయైః సర్వపరిచ్చదై: విధాతుం ప్రీతం ఆత్మానమం దేవ: ప్రక్రమతే స్వయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వ విఘ్నో పశాన్తయే. యస్యద్విరద విక్త్రాద్యా […]

రంగనాధన్‌ స్వామికి ద్రావిడామ్నాయ పరిచర్యా నిరతః అవార్డు

తిరుమల తిరుపతిలో దివ్య ప్రబంధ కైంకర్యం చేస్తూ, వివిధ చోట్ల జరిగే గోష్టులకు హాజరవుతూ, మరోవైపు ప్రవచనాలు చేస్తూ, పరంపరా.ఇన్‌ (paramparaa.in) వెబ్‌ సైట్‌ ద్వారా ఎంతోమందికి దివ్య ప్రబంధాలను నేర్పిస్తున్న డా. చక్రవర్తి రంగనాధన్‌ స్వామికి చెన్నైలో జరిగిన ఏకదిన ప్రబంధ గోష్టిలో సన్మానం చేయడంతోపాటు  ద్రావిడామ్నాయ పరిచర్యా నిరతః అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతిలో శ్రీ రంగనాధన్‌ స్వామి చేస్తున్న కైంకర్యాన్ని అందరూ ప్రశంసించారు. 

16-07-2024  మంగళవారము కటక సంక్రమణం

శ్రీ మతే రామానుజాయ నమః:: శ్రీ మతేనిగమాంతమహాదేశికాయనమః శ్రీ వేంకటచలాధీశం శ్రియాధ్యా సితవక్షసమ్| శ్రిత చేతన మందారం శ్రీనివాస మహం భజే|| ఫాల్గుణే మాసి పూర్ణా యాం ఉత్తర క్షేన్దువా సరే | గోవింద రాజో భగవాన్ ప్రాదురాసేత్ మహామునే :                        పితృ తర్పణ మహిమ ధన్యం యశశ్యం ఆయష్యం స్వర్గ్యాం  శత్రు వినాశనం! కుల సంధారకం చేతి శ్రార్ద మాహూర్‌ మనీ షిణ : !! అర్ధం : మహిమ కల ఈ  పితృ […]

ఘనంగా ముగిసిన శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

తిరుపతిలోని శ్రీ వేదాంత దేశికుల వారి 755వ తిరునక్షత్రం వేడుకలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా పదిరోజులపాటు దేశికులవారికి వివిధ అలంకారాలను చేయడంతోపాటు దివ్య ప్రబంధ పారాయణం, వేద శాత్తుమొరై నిర్వహించారు. చివరిరోజున శ్రీ గోవిందరాజస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతుడై దేశికులవారి సన్నిధికి వేంచేసి దేశికులవారితోపాటు భక్తులను అనుగ్రహించారు. కంభరాజపురం శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు, ఇతరులు టీటిడి అధికారులు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

తిరుపతి శ్రీ దేశికులవారి ఉత్సవాలు 14 నుంచి ప్రారంభం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి గుడి వద్ద ఉన్న శ్రీ వేదాంత దేశికులవారి ఉత్సవాలు అక్టోబర్‌ 14 నుంచి ప్రారంభమవుతున్నాయి. 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. విశేషంగా జరిగే ఈ ఉత్సవాలను ఈసారి కూడా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దివ్య ప్రబంధ పారాయణం, వేద పారాయణం, స్తోత్రపఠనం వంటివి జరగనున్నాయి. కంభరాజపురం శ్రీ శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు ప్రతి సంవత్సరం ఈ దేశికులవారి ఉత్సవాల్లో ప్రబంధ పారాయణం చేస్తున్న సంగతి తెలిసిందే. […]

నెల్లూరులొ ఘనంగా వేదాంత దేశికర్ తిరు నక్షత్ర మహోత్సవం

నెల్లూరు రంగనాయక పేట వేదాంత దేశికర్ దేవస్థానంలొ వేంచేసి ఉన్న శ్రీ స్వామి వారి 755వార్షిక తిరు నక్షత్ర మహోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవ 7 గంటలకుస్వామివారికి శ్వేత చత్ర  పల్లకీ ఉత్సవం, పినాకినీ నది తీర్ధ స్నపన తిరుమంజనం జరిగింది. సాయంత్రం 5గంటలకుశేషవాహనంపై శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి , పల్లకి పై వేదాంత దేశికర్ స్వామి వారికి రంగనాయకులపేట ఉత్సవం తదుపరి సేవా ,శాత్తుమోరై  తీర్థ ప్రసాదగోష్టి […]