Paramparaa – The Tradition Continues…

నెల్లూరులో ఘనంగా గరుడసేవ

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 30వ తేదీ శుక్రవారంనాడు శ్రీ వేంకటేశ్వర స్వామికి గరుడ సేవ ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీ వేదాంత దేశికులవారికి, శ్రీమద్‌ ఆదివణ్‌ శఠకోప స్వామికి తిరుచ్చి ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కొమండూరు శ్రవణ్‌కుమార్‌ వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్‌ ట్రస్ట్‌ కేసి వరదరాజన్‌, నేలటూరు బాలాజీ, కే రామదొరై, రమేష్‌ పలువురు భక్తులు ప్రధాన […]

నెల్లూరులో యాళివాహనంపై కనువిందు చేసిన శ్రీ వేదాంత దేశికులు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో ఆచార్య తిరునక్షత్ర మహోత్సవాలు, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 28వ తేదీ బుధవారంనాడు యాళివాహనంపై దేశికులవారు కనువిందు చేశారు. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కిడాంబి వేణుగోపాల్‌, శ్రీమాన్‌ రాజగోపాలన్‌, శ్రీమాన్‌ డా. అల్లాడి మోహన్‌, శ్రీమాన్‌ ఎ. విద్యాసాగర్‌, శ్రీమాన్‌ ధర్మవరం మధు, శ్రీమాన్‌ సుందర్‌ రాఘవన్‌ వ్యవహరించారు.

నెల్లూరులో హంస, సింహ వాహనంపై
కనువిందు చేసిన వేదాంత దేశికులు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ 26వ తేదీ సోమవారంనాడు శ్రీ వేదాంత దేశికులవారికి హంసవాహన ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కడాంబి సంపత్‌ గోపాలన్‌ వ్యవహరించారు. సెప్టెంబర్‌ 27వ తేదీ మంగళవారం సాయంత్రం సింహవాహనంపై శ్రీ దేశికులవారిని ఊరేగించారు. ఈ ఉత్సవానికి ఉభయకర్తలుగా శ్రీమాన్‌ కడాంబి క్రిష్ణస్వామి కుటుంబం వారు ఉన్నారు.ఈ కార్యక్రమంలో అర్చకులు విజయసారథి, […]

నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన ఆదివణ్‌ శఠగోప యతీంద్రుల ఉత్సవాలు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో అహోబిలమఠం వ్యవస్థాపకులు శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప స్వామి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు సెప్టెంబర్‌ 22 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఆలయ మేనెజింగ్‌ ట్రస్టీలు, సభ్యులు, అర్చకులు, పెద్దలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అందరూ ఈ ఉత్సవాలకు వచ్చి ఆచార్యులవారి కరుణ కటాక్షాలను పొందాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.

నెల్లూరులో 22 నుంచి ఆదివణ్‌ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

నెల్లూరులో 22 నుంచి ఆదివణ్‌ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప యతీర్రదునికి, శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్‌ 22 నుంచి 30వ తేదీ వరకు శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప స్వామికి ఆస్థాన ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఉభయకర్తలుగా ఖతార్‌లో ఉంటున్న శ్రీమాన్‌ నారాయణన్‌, శ్రీమతి ఇందిర, […]

ఘనంగా నడాదూర్‌ చక్రపాణి అయ్యంగార్‌ శతజయంతి వేడుకలు

శ్రీవైష్ణవ సాంప్రదాయ అనుష్టానపరులు, శ్రీమన్నారాయణుని పరమ భక్తాగ్రేసరులు, నడాదూర్‌ వంశోద్ధారకులు, మహారాజశ్రీ కేశవాచారి వారి ప్రియ పుత్రులు, పితృదేవుల సేవకై నెల్లూరులోనే నివాసముండిన శ్రీమాన్‌ నడాదూర్‌ చక్రపాణి అయ్యంగార్‌ వారి శతజయంతి వేడుకలను నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. వారి వంశీయులు నెల్లూరులోని శ్రీ వేదాంతదేశికుల దేవాలయానికి ఎంతో కైంకర్యం చేసినవాళ్ళు. చక్రపాణి అయ్యంగార్‌ నిరంతర సుందరకాండ పారాయణులు, నిత్యం రామాయణ పురాణ గ్రంథ పాఠనా దురంధరులు, పరమ భాగవతోత్తములుగా పేరు పొందారని శ్రీమాన్‌ వరదరాజన్‌గారు పేర్కొన్నారు.

నెల్లూరు శ్రీ దేశికుల దేవాలయంలో ఘనంగా తిరువాడిపురం ఉత్సవం

శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవం సందర్భంగా నెల్లూరులోని శ్రీ వేదాంత దేశిక స్వామి దేవాలయంలో సోమవారం ఆండాళ్‌ అమ్మవారిని అందంగా అలంకరించి ఉత్సవం నిర్వహించారు. పురాణాల ప్రకారం పాండ్య దేశంలో విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో భూదేవి అంశగా ఆండాళ్‌(గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది తిరువాడిపురం వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆండాళ్‌ అమ్మవారు అనుగ్రహించిన తిరుప్పావై, గోదాస్తుతి […]

నెల్లూరు దేశికులవారి దేవాలయంలో తమిళ ఉగాది వేడుకలు

నెల్లూరులోని రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంతదేశికులవారి ఆలయంలో తమిళ ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష తిరుమంజనం ఇతర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. శుభకృత్‌ నామ సంవత్సరం అందరికీ శుభాన్ని కలగజేయాలని ఈ సందర్భంగా స్వామివారిని వేడుకున్నట్లు ఆలయ మేనేజింగ్‌ ట్రస్టీ కేసి వరదరాజన్‌ తదితరులు తెలిపారు.

నెల్లూరు నగరంలో పగల్పత్తు రాపత్తు ఉత్సవాలు

నెల్లూరు నగరం రంగనాయకులపేట లో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి వారికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పగల్పత్తు రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం పదవరోజు రాపత్తు ఉత్సవం సందర్భంగా నమ్మాళ్వార్ కు మోక్ష ప్రాప్తి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. దేవస్థాన అర్చకులు కిడాంబి శ్రీరామ్ ,కిడాంబి సంపత్ నారాయణ, కిడాంబి రామానుజాచార్యులు, సుదర్శనాచార్యుల, ప్రధాన తీర్థ కార్లు తిరుమల వింజమూరు నరసింహాచార్యులు ,పలువురు శ్రీ వైష్ణవ స్వాములు భక్త బృందం ఘనంగా స్వామివారిని […]