Paramparaa – The Tradition Continues…

తిరుపతి శ్రీ దేశికులవారి ఉత్సవాలు 14 నుంచి ప్రారంభం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి గుడి వద్ద ఉన్న శ్రీ వేదాంత దేశికులవారి ఉత్సవాలు అక్టోబర్‌ 14 నుంచి ప్రారంభమవుతున్నాయి. 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. విశేషంగా జరిగే ఈ ఉత్సవాలను ఈసారి కూడా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దివ్య ప్రబంధ పారాయణం, వేద పారాయణం, స్తోత్రపఠనం వంటివి జరగనున్నాయి. కంభరాజపురం శ్రీ శేషాద్రి అయ్యంగార్‌ శిష్యులు ప్రతి సంవత్సరం ఈ దేశికులవారి ఉత్సవాల్లో ప్రబంధ పారాయణం చేస్తున్న సంగతి తెలిసిందే. […]

నెల్లూరులొ ఘనంగా వేదాంత దేశికర్ తిరు నక్షత్ర మహోత్సవం

నెల్లూరు రంగనాయక పేట వేదాంత దేశికర్ దేవస్థానంలొ వేంచేసి ఉన్న శ్రీ స్వామి వారి 755వార్షిక తిరు నక్షత్ర మహోత్సవం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాత సేవ 7 గంటలకుస్వామివారికి శ్వేత చత్ర  పల్లకీ ఉత్సవం, పినాకినీ నది తీర్ధ స్నపన తిరుమంజనం జరిగింది. సాయంత్రం 5గంటలకుశేషవాహనంపై శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి , పల్లకి పై వేదాంత దేశికర్ స్వామి వారికి రంగనాయకులపేట ఉత్సవం తదుపరి సేవా ,శాత్తుమోరై  తీర్థ ప్రసాదగోష్టి […]

తిరుమల బ్రహ్మోత్సవాలు…దివ్యప్రబంధ గానం

కలియుగ వైకుంఠం తిరుమలలో బ్రహ్మోత్సవాల వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా 10 రోజులపాటు శ్రీ వేంకటేశ్వర స్వామివారు వివిధ వాహనాలపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేయనున్నారు. ఈ వాహన సేవల సమయంలో ఆళ్వారులు అనుగ్రహించిన దివ్య ప్రబంధాన్ని పారాయణం చేయనున్నారు. ఏ ఏ వాహనసేవల్లో ఏ ఆళ్వారులు అనుగ్రహించిన ప్రబంధాన్ని గానం చేస్తారన్న విషయంపై తిరుపతి పండితులు, ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌ స్వామి పరంపర భాగవతోత్తములకోసం తమ వ్యాఖ్యానం ద్వారా అందించారు.బ్రహ్మోత్సవాల్లో […]

నెల్లూరులో 13 నుంచి ఆదివణ్‌ శఠగోప స్వామి, శ్రీ వేదాంత దేశికుల ఉత్సవాలు

నెల్లూరులోని శ్రీరామానుజ సర్కిల్‌ రంగనాయకులపేటలో ఉన్న శ్రీ వేదాంత దేశికుల ఆలయంలో శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప యతీర్రద స్వామికి, శ్రీ వేదాంత దేశికులవారికి ఘనంగా ఉత్సవాలను నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్‌ 13 నుంచి 25వ తేదీ వరకు శ్రీమద్‌ ఆదివణ్‌ శఠగోప స్వామికి ఆస్థాన ఉత్సవాలు జరుగుతాయి. స్వామి దేశికులవారి 755వ అవతార తిరునక్షత్రములో భాగంగా శ్రీమాన్‌ నేలటూరు (కొలాయి) రంగస్వామి స్మారకార్థం వారి కుమారులు శ్రీమాన్‌ నేలటూరు నారాయణన్‌ వారు శ్రీ […]

  శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం

  శ్రీజయంతి ( జన్మాష్టమి) తిరువారాధనం మరియు నియమములు                              మునిత్రయ సంప్రదాయం: 1. శ్రీ జయంతి రోజు పూర్తిగా ఉపవాసము చేయవలెను. 2. అట్లు కానియెడల రాత్రి తిరువారాధనం చేయు వరకు ఉపవాసముండి, తిరువారాధనము చేసిన తరువాత స్వామికి   నైవేధ్యం సమర్పించిన తరువాత   వెన్న, పాలు, మొదలగునవి స్వీకరించ వచ్చును. 3. అదియు కానిచో  పగటి పూట ఏకాదశి వలే పలహార వ్రతం చేయ వచ్చును. 4. ఎటు వంటి కారణము చేతను అన్న ప్రసాదము […]

ఘనంగా తిరుమలనంబి అవతార మహోత్సవం

తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి ఆధ్వర్యములో1050వ తిరుమల నంబి అవతార మహోత్సవములు తిరుమల దక్షిణ మాడవీధిలో ఉన్న తిరుమలనంబి ఆలయంలో ఘనంగా జరిగింది. తిరుమలనంబి వంశీయులు, ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు అధికారులు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అధ్యాపకులు, ప్రముఖ పండితులు హాజరయ్యారు. పండితులు ఈ సందర్భంగా చేసిన ఉపన్యాసాలు అందరినీ అలరించాయి. సంస్కృత విద్యాపీఠం ప్రొఫెసర్‌ ఉ.వే. చక్రవర్తి రంగనాధన్‌, తిరుమల నంబి వంశీయులు శ్రీ కణ్ణన్‌ ఆధ్వర్యంలో జరిగిన […]

యజుర్ ఉపాకర్మ – సమిదాధానము

సమిదాధానము శుభ్రంగా స్నానమాచరించి ఊర్ధ్వపుండ్రము ధరించి సంధ్యా వందనము ఆచరించి మరల కాళ్ళు చేతులు శుభ్రముగా కడుగుకొని రెండు సార్లు ఆచమనం  ప్రాణాయామంచేసి  సంకల్పం చేసుకొనవలెను. ప్రాయశ్చిత్తము చేయడంకోసం యజ్ఞో పవీతము ధరించ వలెను. కావలసిన  వస్తులు;:- ధర్భలు, సమిధలు, చెక్క దొప్పలు, చెంఋ  స్థాలీ(పంచపాత్ర), ఔపాసన  అగ్ని గుండం భూర్బవస్సువః అని ప్రోక్షణ చేసి, కూర్చోని ఆచమనం, (2సార్లుచేసి)  పవిత్రం ధరించి శుద్దమైన ప్రదేశములో కూర్చుని.  (2ధర్భల  ఆసనం,2దర్భలు చేతిలో ధరించి) ప్రాణాయామం చేయవలెను. అస్మత్‌ […]

వృషభ (వైగాశి)సంక్రమణం15.05.2023

అథ ,  ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య ,  త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, […]

21-03-2023  పంగుణి(మీన)అమావాస్య

అథ ,  ప్రాత: ,మాధ్యా హ్నికం , భగవరాధానం చ కృత్వా పాదౌ ప్రక్షాళ్య , ద్వి రాచమ్య ,  త్రి భి: ద ర్భై: కృతం పవిత్రం ధృత్వా త్రి: ప్రాణా నాయమ్య రెండు సార్లు ఆచమనం , మూడు సార్లు ప్రాణాయామం. మూడు దర్భలతో చేసిన పవిత్రము దరించి. అస్మత్‌  గురుభ్యో నమ: శ్రీమాన్‌ వేంకట  నాధార్యః  కవితార్కిక కేసరి! వేదాంతాచార్య  వర్యోమే సన్నిదత్తాం సదాహృది .!! గురుభ్య:  తత్‌గురుభ్యశ్చ  నమోవాకం  అధీమహీ వృణీమహేచ, […]